logo

  BREAKING NEWS

మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |   ప‌ద్మ‌విభూష‌ణ్‌, ప‌ద్మ‌భూష‌ణ్‌, ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌తో ఎంత డ‌బ్బు ఇస్తారో తెలుసా ?  |   హింసాత్మకంగా మారిన రైతుల ట్రాక్టర్ ర్యాలీ  |  

మెగా హీరోకి చెల్లిగా సాయి పల్లవి.. అంత రిస్క్ తీసుకుంటుందా?

టాలీవుడ్ లో తనదైనా నటనతో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా కాకుండా కథకు, తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలను చేసుకుంటూ వెళ్తుంది ఈ బ్యూటీ. అయినా సాయి పల్లవి కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజ్ లో ఉంది.

ఇలాంటి సమయంలో సాయి పల్లవి ఓ రిస్కీ ప్రాజెక్ట్ చేయనుందని ప్రచారం జరుగుతుంది. ‘రంగస్థలం’ తర్వాత డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరో చెల్లి పాత్ర చాలా కీలకంగా ఉండడబోతుందని సమాచారం. ఆ పాత్ర కోసం మూవీ మేకర్స్ సాయి పల్లవిని సంప్రదించారట.

ఈ వార్త నిజమైతే ఇది బన్నీ సినిమాకు అదనపు ఆకర్షణగా మారనుంది. కానీ సాయి పల్లవి కెరీర్ గ్రాఫ్ పై కూడా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సిస్టర్ రోల్స్ చేసిన హీరోయిన్లు ఎవ్వరు కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగిన దాఖలాలు తక్కువ.

ఒక వేల చేసినా ఆ తర్వాత క్రమంగా ఆ హీరోయిన్లకు ఆఫర్లు తగ్గిపోవడం మళ్ళీ మళ్ళీ చెల్లెలి పాత్రల్లో నటించాల్సి రావడం ఇలా అనేక కారణాలతో వారు ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. మొదటి నుంచి ఎంతో భిన్నంగా తన కెరీర్ ను మలుచుకుంటుంది సాయి పల్లవి. మరి ఈ సినిమా విషయంలో సాయి పల్లవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Related News