logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

అమ‌ర‌వీరుల స్థూపం ముందు ఎదురుచూస్తున్న సాయి ప‌ల్ల‌వి

విరాట‌ప‌ర్వం సినిమాకు సంబంధించిన హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి లుక్‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. సాయి ప‌ల్ల‌వి జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఇవాళ విడుద‌లైన లుక్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తోంది. అడ‌విలోని ఓ అమ‌ర‌వీరుల స్థాపం ముందు సాయి ప‌ల్ల‌వి ఎదురుచూస్తున్న లుక్ కొత్త‌గా ఉంది. చేతిలో డైరీ, ప‌క్క‌న బ్యాగ్‌తో ఆమె వేచి చూస్తున్న‌ట్లుగా ఈ లుక్ ఉంది. పూర్తిగా గ్రామీణ యువ‌తిగా సాయి ప‌ల్ల‌వి క‌నిపిస్తోంది.

కాగా, నీది నాది ఒకే క‌థ సినిమాతో మంచి పేరు సంపాదించిన వేణు అడుగుల ద‌ర్శ‌క‌త్వంలో విరాట‌ప‌ర్వం సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రానా హీరోగా న‌టిస్తుండ‌గా సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌. న‌క్స‌లిజ‌యం, ప్రేమ నేప‌థ్యంలో కొత్త త‌ర‌హా క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సురేష్ బాబు ఈ సినిమాను స‌మర్పిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో సినిమా ఉంది.

Related News
%d bloggers like this: