యువ హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. వైద్య చికిత్సకు సాయి ధరమ్ తేజ్ స్పందిస్తున్నారు. అయితే, ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నడిపిన బైక్ గురించి చర్చ జరుగుతోంది. మన రోడ్లపై ఇటువంటి స్పోర్ట్స్ బైక్‌లు పని చేయవని కొందరు అంటున్నారు. అసలు సాయి ధరమ్ తేజ్ నడిపించిన బండి ఎవరిది ? దీని ధర ఎంత ? ఈ బైక్ ఫీచర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
సాయి ధరమ్ తేజ్ నడిపింది ట్రయంఫ్ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బైక్. స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ అనే మోడల్ బైక్ ఇది. సాధారణంగా రేసింగ్‌ల కోసం ఈ బైక్‌లను ఎక్కువగా వాడుతుంటారు. రేసింగ్‌లకు తగ్గట్లుగానే ఈ బైక్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్కు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి నుంచి సెకండ్ హ్యాండ్లో సాయి ధరమ్ తేజ్ ఈ బైక్‌ను కొన్నాడు.
ఈ బైక్ షోరూం ధర 12 లక్షల 80 వేలు ఉంటుంది. అయితే, సెకండ్ హ్యాండ్లో సాయి ధరమ్ తేజ్ ఎంతకు కొన్నారనేది తెలియదు. బైక్ కొన్నా కూడా ఇంకా తన పేరు మీదకు మాత్రం సాయి ధరమ్ తేజ్ ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైక్‌లో ఆశ్చర్యకర ఫీచర్స్ ఉన్నాయి. ఇది గంటకు 240 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళుతుంది. 765 సీసీ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఈ బైక్ బరువు దాదాపుగా 166 కిలోలు ఉంటుంది.
ఈ బైక్‌లో 17.4 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఈ బైక్ మైలేజ్ కూడా చాలా తక్కువే ఉంటుంది. లీటరు పెట్రోల్‌కు కేవలం 20 కిలోమీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది. సాయి ధరమ్ తేజ్‌కు బైక్స్ అంటే చాలా ఇష్టం. చిన్న నాటి నుంచి తన మామయ్య పవన్ కళ్యాణ్‌కు చెందిన అవేంజర్, తన తాతకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బండ్లపై ఎక్కి కూర్చోవడం, ఫోటోలు దిగడం చేసేవాడు. పెద్దయ్యాక కూడా బైక్‌లపై తన ఇష్టం కొనసాగింది.