logo

  BREAKING NEWS

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?  |   కంటిచూపు త‌గ్గుతోందా ? ఈ చిన్న చిట్కాలు పాటించండి  |   గూగుల్ విజిటింగ్ కార్డు ఇస్తోంది.. మీకు కావాలా ?  |   బీజేపీలోకి రేవంత్ రెడ్డి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  |   మళ్లీ పాత పార్టీలోకే విజ‌య‌శాంతి  |   మ‌రో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. ఈసారి అంద‌రి అభిమాన సింగ‌ర్‌  |   క‌రోనా సెకండ్ వేవ్ అంటే ఏంటి ? మ‌న ద‌గ్గ‌ర ఎప్పుడు మొద‌ల‌వుతుంది ?  |   మీ ఫోన్‌లో ఈ 21 యాప్‌లు ఉన్నాయా ? ‌వెంట‌నే డిలీట్ చేసేయండి !  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు ?  |   క‌రోనా ప‌రీక్ష‌ల‌కు కొత్త విధానం.. ఇక క‌రోనా టెస్టులు సులువు, చౌక‌  |  

తమన్నాకు విడాకులు.. లావణ్యతో బ్రేక్ అప్.. ‘సాక్రిఫైసింగ్ స్టార్’ సునిశిత్ అరెస్ట్..!

కొంత మంది వ్యక్తులు ప్రముఖుల వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషనల్ కెరీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి రాత్రికి రాత్రి ఫెమస్ అయిపోవాలని ఆరాటపడుతుంటారు. ఈ ఘటనలు కొంత మంది సెలబ్రిటీలకు తలనొప్పి వ్యవహారంగా మారుతుంటాయి. కొందరు వీటిపై స్పందించడానికి నిరాకరిస్తే మరి కొందరు మాత్రం ఇలాంటి వారి భరతం పడుతున్నారు. తాజాగా హీరోయిన్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి పాపులారిటీ తెచ్చుకున్న ‘సాక్రిఫైసింగ్ స్టార్’ సునిశిత్ ను పోలీసులు అరెస్టు చేసారు.

తనను టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలు తొక్కేశారని, మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోగా ముందు తననే అనుకున్నారని ఆ తర్వాత తప్పించారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అనంతరం టాలీవుడ్ హీరోయిన్లను తన లవర్స్ గా చెప్పుకున్నాడు. కొందరితో పెళ్లివరకు వెళ్ళి రద్దు చేసుకున్నానని తెలిపాడు. మరి కొందరు నటీమణులపై హద్దులు ధాటి అసభ్య పదజాలం వాడాడు.

హీరొయిన్ లావణ్య త్రిపాఠి తనతో డేటింగ్ చేసిందని, కొన్ని కారణాల వల్ల బ్రేక్ అప్ చెపుకున్నామని ఇప్పుడు కలిసి ఉండటం లేదని అతను చేసిన వ్యాఖ్యలు వినేవారి మతులు పోగొట్టాయి. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో దీనిపై లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటు రాచకొండ, ఇబ్రహీం పట్నం, కీసర పోలీస్ స్టేషన్లలో సునిశిత్ పై కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన కీసర పోలీసులు సునిశిత్ ను అరెస్టు చేసారు.

Related News