logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఇలా ఆడితే కరోనా కన్ఫర్మ్.. మలింగ పై సచిన్ సెటైర్

ఇప్పటికే క్రీడాకారులు పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు వైరస్ భారిన పడకుండా ఐసీసీ కొన్ని మార్గదర్శకాలను సూచించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా క్రికెటర్లు బంతిపై ఉమ్మడం నిషేధం. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత క్రికెటర్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసారు.

శ్రీలంక పేసర్ లసిత్ మలింగా ఫోటోను షేర్ చేస్తూ.. ఇపుడున్న పరిస్థితుల్లో క్రికెటర్లు తమ బౌలింగ్ పద్దతిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపై మలింగా ఇలా చేయడం ఆపేయాలి. ఏమంటావ్ మలింగా? అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కి మలింగా బాల్ ను ముద్దాడుడుతున్న ఫోటోను జత చేసారు. సహజంగానే ఒక్కో బౌలర్ కు ఒక్కో మేనరిజం ఉంటుంది. బౌలింగ్ సమయంలో వారు తమ అలవాటును ప్రదర్శిస్తుంటారు. అలాగే మలింగకు బౌలింగ్ వేసే సమయంలో బంతిని ముద్దాడటం అలవాటు. కానీ కరోనా ఉమ్ము వేయడం ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందన్న కారణంగా స్లీవ్ ఆపై నిషేధం విధించింది ఐసీసీ. తాజాగా సచిన్ ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ మరోసారి ఆటగాళ్లను హెచ్చరించారు.

Related News