logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

బ్రేకింగ్: బీజేపీకి షాకిచ్చిన ఉప ముఖ్యమంత్రి..!

భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ ఎదురైంది. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సచిన్ పైలట్ చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో విబేధాలు, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదన్న అసంతృప్తితో గత రెండు రోజులుగా సచిన్ పైలట్ పార్టీని వీడనున్నారనే సంకేతాలు పంపిస్తున్నారు. తనకు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని వెల్లడిస్తూ.. గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్దమయినట్టు వార్తలు వచ్చాయి.

ఈ వార్తలు నిజం చేస్తూ.. ఆయన నేడు న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సచిన్ సమావేశం కావడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో జైపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీఎం నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావలసి ఉంది. దీంతో అప్రమత్తమైన రాహుల్ గాంధీ సచిన్ ను బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మీటింగ్ కు మొదట తాను హాజరుకానని చెప్పిన పైలట్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ తానేమీ బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేసారు.

కాంగ్రే పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన బీజేపీ జ్యోతిరాదిత్య సింథియాలాగానే సచిన్ ను కూడా పార్టీలో చేర్చుకోవాలని ఎదురు చూసింది. కానీ సచిన్ తాజా నిర్ణయంతో బీజేపీకి చుక్కెదురైంది. సచిన్ ను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి సిద్ధమని గతంలో బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఉప ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు పదవుల్లో సచిన్ ఉండటం, పార్టీలో అతనికి ప్రాధాన్యత పెరిగిపోతుండటం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఇష్టం లేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

200 మంది ఎమ్మెల్యేలున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా గెహ్లాట్ సర్కారుకు మద్దతిస్తున్నారు. అయితే సచిన్ పైలట్ వర్గీయులు పట్టుబడితే గెహ్లాట్ సర్కారు కూలిపోయే అవకాశం ఉంది. సచిన్ కూడా పార్టీని వీడి బీజేపీతో కలుస్తారని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. కానీ ఇప్పుడా అంచనాలను తలకిందులు చేస్తూ సచిన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అటు బీజేపీలో చేరకుండా సొంత పార్టీ పెట్టె కూడా సమాచారం.

Related News