logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పెళ్లి పీటలెక్కనున్న సాహో దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?

తెలుగు సినీ పరిశ్రమలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలంతా పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇటీవల హీరో నిఖిల్ ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. దగ్గుబాటి వారసుడు రానా- మిహికల వివాహం కూడా ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు మరో యువదర్శకుడు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుజిత్ రెండో సినిమాకె ప్రభాస్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసి సక్సెస్ అయ్యాడు. ‘సాహో’ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయిన సుజిత్ టేకింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

తాజాగా ఇండస్ట్రీలో సుజిత్ పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి. సుజిత్ కొంత కాలంగా ప్రవళిక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని వీరిద్దరి ప్రేమకు పెద్దలు కూడా ఒకే చెప్పడంతో త్వరలోనే సుజిత్ పెళ్లి పీటలెక్కబోతున్నాడని సమాచారం. ప్రవళిక వృత్తి రీత్యా డాక్టర్ అని తెలుస్తుంది. వీరిద్దరి నిశ్చితార్థం జూన్ 10 వ తేదీన సన్నిహతుల మధ్య జరగనుందని సమాచారం.

ప్రస్తుతం సుజిత్ మలయాళం రీమేక్ అయిన మోహన్ లాల్ ‘లూసిఫెర్’ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ రీమేక్ లో చిరంజీవి నటిస్తుండగా, రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మలయాళం కథకు చిరంజీవి కోసం కొన్ని మార్పులు చేసి ఈ కథను సిద్ధం చేస్తున్నాడు సుజిత్.

Related News