logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

రాజమౌళి పై రష్యన్ ఎంబసీ ట్వీట్..!

బాహుబలి సినిమాతో భారతీయుల సత్తాను ప్రపంచం నలుమూలల చాటారు దర్శకుడు రాజమౌళి. ఈ ఒక్క సినిమాతో ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది. భారత్ లోనే కాకుండా జపాన్, రష్యా వంటి దేశాల్లో బాహుబలి టీమ్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తాజాగా దర్శకుడు రాజమౌళిని కీర్తిస్తూ రష్యన్ ఎంబసీ ఓ ట్వీట్ ను చేసింది.

2017 మాస్కో ఫిలిం ఫెస్టివల్‌లో భాగంగా బాహుబలి 2 ప్రదర్శన కోసం రాజమౌళి, ఆయన సతీమణి రమా రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులు కుటుంబ విలువలకు అధిక ప్రాధాన్యమిస్తారు. అది భారతీయుల డీఎన్ఏ లోనే ఉంది. భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థ ఒక భాగం. ఈ అద్భుతమైన బంధాలను నా సినిమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడమే నా ఉద్దేశ్యం అంటూ ప్రసంగించారు.

ఆయన ప్రసంగాన్ని రష్యా ఓ ప్రకటన ద్వారా తెలియజేజేసింది. రాజమౌళి ప్రసంగానికి అక్కడి వారు ఫిదా అయ్యారు. తాజాగా ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ రష్యన్ ఎంబసీ ఆనాటి ఫోటోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. రాజమౌళిని కీర్తిస్తూ ట్వీట్ చేసారు. గత నెల రష్యన్ భాషలో టెలివిజన్ లలో బాహుబలి సినిమాను అక్కడ టెలికాస్ట్ చేసిన సందర్భంగా జరిగిన హడావుడి తెలిసిందే. ఆ చిత్రానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని రష్యా ఎంబసీ ప్రకటించింది.

Related News