logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

శుభవార్త: ప్రపంచంలోనే కరోనాకు తొలి వాక్సిన్!

కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కట్టడికి వాక్సిన్ కనిపెట్టడానికి అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా భారత్ తో సహా అవన్నీ ప్రయోగ దశలో ఉన్నాయి. వీలైనంత త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే రష్యా మాత్రం వాక్సిన్ విషయంలో ఒక అడుగు ముందుకేసి శుభవార్త వినిపించింది. కరోనా వాక్సిన్ ట్రయల్స్ ను విజయవంతంగా పూర్తి చేసింది.

రష్యాకు చెందిన గమలీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీ అండ్‌ మైక్రోబయాలజీ కరోనా వాక్సిన్ ను తయారు చేసింది. కాగా ప్రపంచంలోనే తొలిసారిగా ఈ వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి చేయడం విశేషం. జూన్ నెల 18 న కొంతమంది వాలంటీర్లపై రష్యా వాక్సిన్ ట్రయల్స్ ను మొదలు పెట్టింది. తాజాగా దీనిలో విజయం సాధించిందని ఆ దేశానికి చెందిన సెచెనోవ్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. వీరందరిని బుధవారం డిశ్చార్జ్ చేయనున్నారు.

ఇవి కూడా ప్రస్తుతం కరోనాకు మార్కెట్ లో లభిస్తున్న వాక్సిన్ల లాగానే అత్యంత సురక్షితమైనది వారు వెల్లడించారు. ఇక తొందర్లోనే దీనిని అందుబాటులోకి తెచ్చి కరోనా రోగులకు ఇవ్వనున్నారు.

Related News