logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

గుడ్ న్యూస్: ఈ 18 రకాల సేవల కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్ళక్కర్లేదు..!

వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వాహనాలకు సంబందించిన ఏ చిన్న విషయమైనా ఆర్టీవో ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఇప్పుడు 18 రకాలైన ఆర్టీవో సేవలను ఆర్టీవో ఆఫీసులకు వెళ్లకుండానే పొందవచ్చు. అవేంటో చూద్దాం..

కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజల సౌకర్యార్థం లెర్నర్ లైసెన్స్ పొందడం, డ్రైవర్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవడం లాంటి 18 రకాలసేవలను ఆన్ లైన్ చేస్తున్నట్టుగా కేంద్ర రవాణా మరియు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీని ప్రకారం..

లెర్నర్ లైసెన్స్ ను ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు
డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేని డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చు
డ్యూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ను పొందవచ్చు
డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో అడ్రెస్ మార్చుకోవచ్చు
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ పొందవచ్చు
లైసెన్స్ నుండి క్లాస్ ఆఫ్ వెహికిల్ సరెండర్ చేయవచ్చు
మోటార్ వెహికిల్ టెంపోరరీ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
ఫుల్ బిల్డ్ బాడీ మోటార్ వెహికిల్ రిజిస్ట్రేషన్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవచ్చు
డ్యూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం అప్లై చేయవచ్చు
రిజిస్ట్రేషన్ కోసం ఎన్ ఓసీకి అప్లై చేయవచ్చు
మోటార్ వెహికిల్ ఓనర్ షిప్ ట్రాన్స్ ఫార్ నోటీసును జారీ చేయవచ్చు
మోటార్ వెహికిల్ ఓనర్ ట్రాన్స్ఫర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
రిజిస్ట్రేషన్ అడ్రస్ సెర్టిఫికెట్ లో అడ్రెస్ ను మార్చుకోవచ్చు
అక్రిడేటెడ్ డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్ లో డ్రైవర్ ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
మోటార్ వెహికిల్ డిప్లొమాటిక్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు
మోటార్ వెహికిల్ డిప్లొమాటిక్ ఆఫీసర్ కు తాజా రిజిస్ట్రేషన్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు

ఈ సేవలను ఆన్ లైన్ ద్వారా ప్రజలు ఇంటి నుంచే పొందాలంటే వినియోగదారులు కచ్చితంగా ఆధార్ అతన్టీకేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

Related News