logo

  BREAKING NEWS

‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |  

హైదరాబాద్ లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం..

హైదరాబాద్ నగరంలో లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులను పునః ప్రారంభించనున్నారు. తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నారు.

సిటీ బస్సులతో పాటుగా అంతర్ రాష్ట్ర సర్వీసులను ఏ విధంగా నడపాలని దానిపై మంత్రి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. లాక్ డౌన్ నిబంధనలను సడలించి కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తెరిచినప్పటికీ రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబందులకు గురవుతున్నారు. దీంతో ఈ నెల 8వ తేదీ నుండి నగరంలో బస్సులను రోడ్డేకించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు.

ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ సామజిక దూరం పాటించే సౌలభ్యం లేకపోవడంతో ప్రయాణికులు వాటిపై మొగ్గు చూపడం లేదు. ఇక ప్రతి ఒక్కరు తమ సొంత వాహనాలను వినియోగిస్తుండటంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిటీలో బస్సు సర్వీసులు ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ సీఎం కేసీఆర్ వాహనాలకు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

Related News