logo

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త..!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కూడా రాజపోకలు నిలిచిపోయాయి. ఎన్నిసార్లు చర్చలు జరిగినా బస్సు సర్వీసులు మాత్రం పునరుద్ధరించబడలేదు. తాజాగా ఆర్టీసీ సంస్థ రెండు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో ఏడు నెలల సుదీర్ఘ విరామమే తర్వాత ఈరోజు నుంచే ఏపీ- తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులను నడపనున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు.

ఊహించని విధంగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలపై నెలకొన్న ప్రతిష్టంభన చివరకు తొలగింది. రాష్ట్రాల మధ్య బస్సు సౌకర్యాలు లేక ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజా రవాణాను పునరుద్ధరించే విషయమై ఉన్నతాధికారులు ఓ మెట్టు దిగి రావడంతో తాజాగా బస్సుల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ పడింది.

తాజా ఒప్పందం ప్రకారం ఏపీలో 1,61,258 కిలోమీటర్ల మేర టీఎస్సార్టీసి బస్సులు నడపనుంది. అదే విధంగా 1,60,999 కిలోమీటర్ల మేర 638 ఏపీఎస్సార్టీసి బస్సులను నడపనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఎంవోయూపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు సంతకాలు చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు పరుగులు పెట్టనున్నాయి.

Related News