logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

శుభవార్త: హైదరాబాద్ కు రష్యా వాక్సిన్.. పంపిణీ ఎప్పుడంటే?

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రపంచమంతా వాక్సిన్ తయారీలో తలమునకలై ఉంది. రష్యా మాత్రం వాక్సిన్ తయారీలో ఇతరదేశాల గట్టి పోటీనిస్తుంది. కరోనా వాక్సిన్ ను నమోదు చేసిన తొలి దేశంగా ఈఏడాది ఆగస్టులో రష్యా రికార్డుకెక్కింది. స్పుత్నిక్ వీ పేరుతో రష్యా తయారు చేసిన ఈ కరోనా వాక్సిన్ మొదట వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొందరిలో స్పుత్నిక్ వాక్సిన్ దుష్ప్రభావాలను చూపుతున్నట్టుగా గుర్తించారు.

దీంతో ఈ వాక్సిన్ ను మూడో దశలో భారీగా 40 వేల మందిపై ప్రయోగించి మంచి ఫలితాలను రాబట్టారు. వీరిపై చేసిన ప్రయోగాల్లో ఎలాంటి దుష్ప్రభాలు చోటుచేసుకోలేదని రష్యా తెలిపింది. అంతే కాదు యాంటీబాడీల పరంగా కూడా ఈ వాక్సిన్ మంచి ఫలితాలను రాబడుతుందని ది లాన్సెట్, బ్లూమ్ బర్గ్ వంటి ప్రఖ్యాతిగాంచిన జర్నల్స్ ప్రచురించాయి.

రష్యా వాక్సిన్ కు కరోనా తీవ్రంగా ఉన్న దేశాల్లో భారీగా డిమాండ్ పెరిగింది. భారత్ కూడా ఈ రష్యా వాక్సిన్ ను దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్ వి వాకిన్ హైదరాబాద్ కు చేరుకుంది. మన దేశంలోరెడ్డీస్ ల్యాబ్ లో రెండు, మూడు దశల్లో ప్రయోగాలను జరిపేందుకు రష్యా తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.

అందులో భాగంగా భారత్ లో మొదట 2 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ నెల 15వ తేదీ నుంచి రెడ్డీస్ ల్యాబ్ లో వాక్సిన్ ప్రయోగాలు ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అనంతరం ఈ ఫలితాలను డీసిజిఐ ఆమోదించవలసి ఉంటుంది. ఇప్పటికే ఈ వాక్సిన్ 92 శాతం మంచి ఫలితాలను ఇస్తున్నట్టుగా రష్యా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కి భారత్ అనుమతించినట్లయితే వంద మిలయన్ల డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్ ను రెడ్డీస్ ల్యాబ్ కు సరఫరా చేయనున్నట్లు ఆర్డీఐఎఫ్ వెల్లడించింది.

వీటితో రెడ్డీస్‌ ల్యాబ్‌ రెండు, మూడు దశల ట్రయల్స్‌ చేపట్టనుంది. మూడో దశ ట్రయల్స్‌ వచ్చే ఏడాది మే నాటికి పూర్తవుతాయని అంచనా. స్పుత్నిక్‌ వీ ఎక్కువకాలం పాటు కారోనా నుంచి రక్షణనిస్తుందని రష్యా ప్రభుత్వం చెబుతోంది. ఈ వాక్సిన్ ద్వారా కనీసం రెండేళ్ల వరకు కరోనా రాకుండా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు.

 

Related News