logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

”ఆర్ఆర్ఆర్”: మెగాస్టార్ అభిమానులకు పండగలాంటి వార్త!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిషాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లు, ఎన్టీఆర్, చరణ్ ల లుక్ లు విడుదలై సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నసినిమా కావడంతో ఈ సినిమాకు సంబందించి ఏ చిన్న అప్ డేట్ అయినా హాట్ టాపిక్ గా మారుతుంది.

ఈ సినిమాలో మన్యంవీరుడు అల్లూరి సీతారామ రాజుగా రాంచరణ్ నటిస్తుండగా..గిరిజన వీరుడు కొమరం భీంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఒక ఇంట్రిస్టింగ్ వార్త ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ ఇటు ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం కాబోతున్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ కోసం బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులను రంగంలోకి దింపాడు రాజమౌళి.

జక్కన్న టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ తెరకెక్కితున్నఈ సినిమాకోసం రాజమౌళి మెగాస్టార్ ను కలిశాడట. అన్ని భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాత్రల పరిచయంకోసం చిరంజీవిని వాయిస్ ఓవర్ ఇవ్వాలని కోరారట. మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ తాజాగా చిరంజీవి పేరు వినిపిస్తుంది. రాజమౌళి అడగ్గానే చిరంజీవి వెంటనే ఒకే చెప్పేశారట. ఈ వార్త ఇప్పుడు మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపుతుంది.

 

 

Related News