logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు

కొమ‌రం భీం, అల్లూరి సీతారామ‌రాజు జీవితాల ఆధారంగా ఒక క‌ల్పిత క‌థ‌ను ఆర్ఆర్ఆర్ సినిమాగా ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతిని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అన‌డంలో ఎవ‌రికీ సందేహం లేదు. బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి క్రేజ్ విప‌రీతంగా పెరిగిపోయింది. రాజ‌మౌళి సినిమా కోసం కేవ‌లం తెలుగువాళ్లే కాదు ప్యాన్ ఇండియా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు స్టార్ హీరోలు కావ‌డం, ఆర్ఆర్ఆర్‌లో ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తుండ‌టంతో ఈ సినిమా క్రేజ్ పీక్స్‌లో ఉంది. ఈ స‌మ‌యంలో కొమ‌రం భీం జ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమాలో భీం పాత్ర‌లో న‌టిస్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంట్రోను విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ల‌క్ష‌ల మంది ఈ టీజ‌ర్‌ను వీక్షించారు.

అయితే, ఇది అలా విడుద‌లైందో లేదో ఈ టీజ‌ర్‌లోని కొన్ని సీన్లు కాపీ అంటూ నెటిజ‌న్లు ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టారు. టీజ‌ర్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి రామ్ చ‌ర‌ణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ చెబుతుంటాడు. వాడి పొగ‌రు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీక‌ట్ల‌ను చీల్చే మండుతెండ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో రామ్‌చ‌ర‌ణ్ డైలాగ్ వ‌స్తుంటే ఎన్టీఆర్‌ను బీక‌రంగా చూపిస్తుంటారు. ఇక్క‌డే అగ్ని ప‌ర్వ‌తం బ‌ద్ద‌ల‌య్యే ఒక షాట్ చూపిస్తారు.

ఈ షాట్ మొద‌టి కాపీగా నెటిజ‌న్లు అంటున్నారు. నేష‌న‌ల్ జియాగ్రాఫి ఛానెల్ వాళ్లు తొమ్మిది నెల‌ల క్రితం వాళ్ల యూట్యూబ్ ఛాన‌ల్‌లో వాల్క‌నోస్ 101 అనే వీడియోను పెట్టారు. ఈ వీడియోలో ఉన్న షాట్‌నే రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ టీజ‌ర్‌లో పెట్టేశారు. ఇదే కాదు టీజ‌ర్‌లో చూపించిన అడ‌వి, నీళ్లు వంటి షాట్‌లు కూడా ఇప్ప‌టికే యూట్యూబ్‌లో ఉన్న వివిధ వీడియోల నుంచి క‌ట్ చేసి పెట్టేశార‌ని నెటిజ‌న్లు గుర్తించారు.

దీంతో రాజ‌మౌళి కాపీ షాట్లతోటి టీజ‌ర్ విడుద‌ల చేశార‌ని ఎద్దేవా చేస్తున్నారు. అయితే, రాజ‌మౌళి అభిమానులు మాత్రం ఈ కామెంట్స్‌ను కొట్టి పారేస్తున్నారు. లాక్‌డౌన్ వ‌ల్ల ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అనుకున్న‌దాని కంటే చాలా ఆల‌స్య‌మైంది. కొమ‌రం భీం జ‌యంతికి ఎన్టీఆర్ లుక్ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం అనుకుంది. అందుకే ఎన్టీఆర్ షాట్‌ల‌తో పాటు కొన్ని అద‌న‌పు షాట్‌ల‌ను బ‌య‌ట వీడియోల నుంచి తీసుకున్నారు. ఇందులో కాపీ అని ఏమీ లేద‌ని అంటున్నారు.

అగ్నిప‌ర్వతం బ‌ద్ద‌ల‌య్యే వీడియోను ఏ ద‌ర్శ‌కుడు కూడా కొత్త‌గా చూపించ‌లేడ‌ని, ఇప్ప‌టికే ఉన్న వీడియోల‌ను వాడుకోవ‌డం త‌ప్ప వేరే మార్గం లేద‌ని అంటున్నారు. మొత్తానికి ఒక‌వైపు టీజ‌ర్ రికార్డులు సృష్టిస్తున్న స‌మ‌యంలోనే ఈ కాంట్ర‌వ‌ర్సీ తెర‌మీద‌కు వ‌చ్చింది. కాపీ కొట్టినా స‌రే రాజ‌మౌళి తెర‌కెక్కించారంటే దానికి ఇక తిరుగుండ‌దు. కాబ‌ట్టి, టీజ‌ర్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.

Related News