logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

విలేక‌రి నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు.. ర‌ఘునంద‌న్ జీవితమే ఒక పోరాటం

మాధ‌వ‌నేని ర‌ఘునంద‌న్ ‌రావు. ఈ పేరు ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌. ఎదుర‌నేదే లేకుండా వెళుతున్న టీఆర్ఎస్ కారుకు బ్రేకులు వేసిన నేత ఆయ‌న‌. తెలంగాణ‌లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఉజ్వ‌ల‌ భ‌విష్య‌త్ ఉంద‌ని నిరూపించిన నేత‌. టీఆర్ఎస్ కంచుకోట‌లో ఆ పార్టీని చిత్తు చేసిన లీడ‌ర్‌. ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడిన నేత‌ను ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుంటార‌ని నిరూపించిన నాయ‌కుడు. ప్ర‌శ్నించే గొంతుకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌తార‌ని రుజువు చేసిన వాయిస్ ఆయ‌న‌.

దుబ్బాక ఉప ఎన్నిక‌లో అనూహ్య విజ‌యం సాధించిన ర‌ఘునంద‌న్ రావు బీజేపీలో సంబ‌రాలు నింపారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంద‌ని నిరూపించారు. ఇప్పుడు రాష్ట్రంలోని బీజేపీ కీల‌క నేత‌ల్లో ఒక‌రిగా, రాష్ట్రవ్యాప్తంగా యువ‌త‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న నేత‌గా ఎదిగిన ర‌ఘునంద‌న్ జీవితంలో ఆస‌క్తిక‌ర మ‌లుపులు ఉన్నాయి.

విలేఖ‌రిగా మొద‌లైన ఆయ‌న ప్ర‌స్థానం ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి చేరుకుంది. దుబ్బాక‌కు చెందిన ర‌ఘునంద‌న్‌రావు సిద్దిపేట‌లో బీఎస్సీ చ‌దువుకున్నారు. ఆ త‌ర్వాత‌ ఉస్మానియా యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్‌బీ చ‌దివిన ర‌ఘునంద‌న్‌రావు కొంత కాలం పాటు విలేఖ‌రిగా పని చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న లాయ‌ర్‌గా ప్రాక్టీస్ మొద‌లుపెట్టారు.

స్వ‌ల్ప కాలంలోనే త‌న ప్రావీణ్యంతో న్యాయ‌వాద వృత్తిలో రాణించి బాగా పేరు తెచ్చుకున్నారు. విద్యార్థి ద‌శ నుంచే రాజ‌కీయాల ప‌ట్ల‌, స‌మాజం ప‌ట్ల స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌, చైత‌న్యం క‌లిగిన ర‌ఘునంద‌న్ ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌ని చేశారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన త‌ర్వాత ఆ పార్టీలో చేరిన ఆయ‌న మెద‌క్ జిల్లాలో కీల‌క నేత‌గా ఎదిగారు.

ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ వాయిస్‌ను బ‌లంగా వినిపించారు ర‌ఘునంద‌న్‌. టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌గా ఎదిగిన ర‌ఘునంద‌న్ రావు ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకు పార్టీ అధ్య‌క్షుడిగా, పోలిట్‌బ్యూరో స‌భ్యుడిగా కూడా ప‌ని చేశారు. అయితే, టీఆర్ఎస్ అంత‌ర్గ‌త రాజ‌కీయాల నేప‌థ్యంలో 2013లో తెలంగాణ ఆవిర్భ‌వించ‌డానికి ముందు ర‌ఘునంద‌న్‌ను టీఆర్ఎస్ పార్టీ స‌స్పెండ్ చేసింది.

త‌ర్వాత ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో దుబ్బాక అసెంబ్లీ నుంచి పొటీ చేసి ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. రెండుసార్లు కూడా ఆయ‌న మూడో స్థానంలో నిలిచారు. కానీ, దుబ్బాక‌ను ర‌ఘునంద‌న్ ఏనాడూ వ‌ద‌ల‌లేదు. ఓడిపోయినా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు, బీజేపీ క్యాడ‌ర్‌కు అందుబాటులో ఉంటూ వ‌చ్చారు. మ‌రో వైపు త‌న వాక్చాతుర్యం, రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌, ముక్కుసూటిగా మాట్లాడే త‌త్వంతో రాష్ట్ర ప్ర‌జ‌ల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ముఖ్యంగా ర‌ఘునంద‌న్ స్పీచ్‌ల‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ర‌ఘునంద‌న్ లాంటి నాయ‌కుడు అసెంబ్లీలో ఉండాల‌నే భావ‌న ఏర్ప‌డింది. ఇంత‌లో వ‌చ్చిన దుబ్బాక ఉప ఎన్నిక‌లో ఇవ‌న్నీ ఆయ‌న‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాయి. రెండుసార్లు మూడో స్థానంలో నిలిచినా ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ఆయ‌న కొట్లాడి ఈ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించారు.

Related News