logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

టిక్ టాక్ స్టార్ ‘రౌడీబేబీ’ ఆత్మహత్యాయత్నం..!

టిక్ టాక్ లో రౌడీబేబీ సూర్య గా ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. తమిళనాడుకు చెందిన సుబ్బలక్ష్మి రౌడీ బేబీ సూర్య పేరుతో టిక్ టాక్ వీడియోలు చేసి పాపులర్ అయ్యింది. సింగపూర్ వెళ్లిన సుబ్బలక్ష్మి లాక్ డౌన్ కారణంగా మూడు నెలల పాటు అక్కడే చిక్కుకుంది. అయితే ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఇండియాకు తిరిగి వచ్చింది.

నిబంధనల ప్రకారం విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు ఎవరైనా క్వారెంటైన్ లో ఉండవలసి ఉంటుంది. అయితే అందుకు ఆమె అంగీకరించలేదు. పోలీసులకు చెప్పకుండా తప్పించుకుని ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆమె ఇంటి పక్కన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను తిరిగి క్వారెంటైన్ కు తరలించే ప్రయత్నం చేసారు. తాను ప్రభుత్వాసుపత్రిలో క్వారెంటైన్ లో ఉండలేనని ఇంట్లోనే ఉంటానని ఆమె మొండికేసింది.

ఆమెకు నచ్చజెప్పి క్వారెంటైన్ కు తరలించే సమయంలో నానా రభస చేసింది. అదే సమయంలో ఆమె ఓ విలేకరిని అసభ్య పదజాలంతో దూషించింది. దీంతో అతను సుబ్బలక్ష్మి పై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసారు.మీడియాలో తనపై కథనాలు వస్తుండటం, కేసు నమోదు కావడంపై ఆమె మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది.

సుబ్బలక్ష్మి నిన్న ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. కాగా ఆమె ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

Related News