logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బీపీ, గుండె జబ్బులు, అజీర్తి సమస్యలు ఉన్నవారు ఉప్పుకు బదులుగా దీనిని వాడండి

ఉప్పు రుచి తగలకుంటే ఎలాంటి వంటకమైనా తినలేము. అలాగని ఉప్పును ఎక్కువుగా వాడితే మాత్రం హైబీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే హైబీపీతో బాధపడేవారు ఉప్పును చాలా తక్కువగా వాడాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కోసం ఒక చక్కటి పరిష్కారం ఉంది. అదే సైంధవ లవణం. దీనిని స్వచ్ఛమైన ఉప్పుగా చెప్తారు. మనకు భూమి మీద లభించే 5 రకాల లవణాలలో సైంధవ లవణాన్ని అత్యంత శ్రేష్ఠమైనదిగా ఆయుర్వేదంలో చెప్పబడింది. దీనినే రాక్ సాల్ట్ అని కూడా పిలుస్తారు.

ఉప్పుకు బదులుగా సైంధవ లవనాన్ని వంటల్లో వాడితే ఉప్పు వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవడమే కాదు ఎన్నో రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. మరి ఇంతలా ఇందులో ఏముంది అంటే.. సైంధవ లవణంలో 84 రకాల పోషకాలు ఉంటాయి. మన రోజు వాడే ఉప్పుకన్నా దీని రుచి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అంటే మూడు చెంచాల ఉప్పుకు బదులుగా రెండు చెంచాల సైంధవ లవణం వేస్తే సరిపోతుంది. ఈ లవణంలో కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం, పాస్ఫరస్, పొటాషియం, సిలికాన్, సల్ఫర్, జింక్, అయోడిన్ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు.

అజీర్తి సమస్యలతో బాధపడేవారు భోజనం తర్వాత మజ్జిగలో ఈ లవణాన్ని కలిపి తాగితే గ్యాస్, పొట్ట ఉబ్బరం, కడుపునొప్పి వెంటనే తగ్గిపోయాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. శరీరంలో కొవ్వును కరిగించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ ప్రక్రియను చురుగ్గా మార్చడం ద్వారా ఇది కొవ్వును తేలికగా కరిగించేస్తుంది. కడుపులో పురుగులను నశింపచేస్తుంది. నోటి దుర్వాసన, పంటి నొప్పి, టాన్సిల్స్, గొంతు నొప్పిని తగిస్తుంది. మలబద్దకానికి మంచి మెడిసిన్ గా చెప్పవచ్చు. నోటి ఇంగ్ఫెక్షన్, గొంతు నొప్పి, నోటిలో పుండ్లతో బాధపడేవారు నీటిలో కొంచెం సైంధవ లవణాన్ని వేసి పుక్కిలిస్తే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి.

తరచుగా గొంతు తడారిపోయేవారు కూడా ఈ విధంగా చేయచ్చు. విపరీతమైన దగ్గు, కఫము సమస్య వేధిస్తుంటే సైంధవ లవణంతో వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఉప్పుకు బదులుగా సైంధవ లవణం వాడేవారిలో ఆస్తమా, బ్రాంకైటిస్, శ్వాసకోశ నాళాల వ్యాధులు రాకుండా చేస్తుంది. శరీర దుర్వాసనతో బాధపడేవారు స్నానం చేసే నీటిలో ఈ లవణాన్ని వేసుకోవాలి. ఇది శరీర దుర్గంధాన్ని రాకుండా చేస్తుంది. క్రమం తప్పవుకుండా దీనిని వాడేవారిలో నపుంసకత్వం, కీళ్ల నొప్పులు ఉండవు. ఎముకలను ధృడంగా ఉంచుతుంది.

జీలకర్రలో సైంధవ లవణం కలిపి తింటే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఆకలిలేని వారు సైంధవ లవణ, పసుపు, శొంఠి పొడి కలిపి అన్నంలో కలిపి తింటే ఆకలి పెరుగుతుంది. సన్నగా ఉన్నవారు బరువు పెరుగుతారు. నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి తాగితే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. అల్లం రసం సైంధవ లవణాన్ని భోజనానికి ముందు తింటే అజీర్తి సమస్య తగ్గుతుంది.

Related News