logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

ఉప్పల్ లో లారీ భీభత్సం ఒకరు మృతి..!

హైదరాబాద్ నగరంలోకి ఉప్పల్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున లారీ భీభత్సం సృష్టించింది. హబ్సిగూడ-ఉప్పల్ రహదారిలో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న లారీ ముందు ఉన్న డిసిఎం ను ఢీ కొట్టింది. డిసిఎం ముందున్న బైకర్లపైకి దూసుకెళ్లడంతో పాటుగా పక్కనే ఉన్న ఆలయ ప్రహరీ గోడను ధ్వంసం చేసింది.

ఈ ప్రమాదంలో ఒక ద్విచక్రవాహనదారుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ప్రమాదం జరగడంతో ఈ ప్రమాదానికి కారణం పొగ మంచు కూడా కారణం అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. కాగా ప్రమాద స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి పరిశీలించారు. కొత్త సంవత్సరం రోజునే ఇలాంటి దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు.

Related News