2007 లో మిస్ ఇండియా యుఎస్ఏ టైటిల్ ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది రిచా గంగోపాథ్యాయ. శేఖర్ కమ్ముల ‘లీడర్’ సినిమాతో ఆమె టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తర్వాత రిచా నటించిన మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి.
ఆ తర్వాత హఠాత్తుగా రిచా తాను సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్టుగా ప్రకటించి షాకిచ్చింది. తనకు సినిమాల కన్నా చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయని ఆమె చివరి సారిగా ఓ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. ఆ తర్వాత సోషల్ మీడియా ఖాతాలను కూడా తొలగించింది. అనంతరం రిచా తన స్వస్థలమైన అమెరికాకు వెళ్ళిపోయింది.
తన స్నేహితుడినే ప్రేమించి పెళ్లాడింది రిచా. అప్పట్లో రిచా పై రకరకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పడానికి గల కారణాలు వెల్లడించింది. తనకు ఎప్పటి నుంచో ఎంబీఏ చేయాలనే చిన్ననాటి కళ ఉండేదని తెలిపింది. సడెన్ గా ఆ అవకాశం రావడంతో తాను సినిమాల నుంచి తప్పుకున్నానని తెలిపింది.
తాను అనుకున్నట్టుగానే 2017లో వాషింగ్టన్ యూనివర్సిటీ నుండి రిచా ఎంబీఏ డిగ్రీ పూర్తి చేసింది. అదే సమయంలో తన క్లాస్ మెట్ , స్నేహితుడైన లాంజెల్లను 2019 లో వివాహం చేసుకుంది రిచా. తెలుగులో ఆమె నాగార్జునతో కలిస్ ‘భాయ్’ సినిమాలో చివరగా నటించింది. సినిమాలు కెరీర్ ను వదులుకోవద్దని నాకు చాలా మంది సలహా ఇచ్చారు. అందుకు తానేమీ బాధపడటం లేదని చెప్పి రూమర్లకు చెక్ పెట్టింది రిచా.