logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

కొత్త ట్విస్ట్ : సుశాంత్ స్నేహితుడితో కూడా అంకిత డేటింగ్ చేసిందా..?

సుశాంత్ సింగ్ కేసులో అతని ప్రియురాలు రియా చక్రబర్తి పై వస్తున్న ఆరోపణల కారణంగా ఆమె సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంకా నిజానిజాలు తేలక ముందే తనను అంతా కలిసి దోషిగా పేర్కొంటున్నారంటూ రియా అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. రియాపై సుశాంత్ కుటుంబంతో పాటుగా అతని మాజీ ప్రియురాలు అంకిత లోఖండే కూడా తీవ్ర ఆరోపణలు చేస్తుంది.

రియా అతనికి డ్రగ్స్ అలవాటు చెందని అందువల్లే సుశాంత్ డిప్రెషన్ లోకి వెళ్లాడని అంటుంది. సుశాంత్ తనకు 2016 నుంచి పరిచయం అని తనతో ప్రేమలో ఉన్న సమయంలో అతనికి ఎలాంటి మానసిక సమస్యలు లేవని చెప్తుంది. అంతేకాదు రియా తనను వేధిస్తోందని ఆ విషయం సుశాంత్ కంగనతో కూడా చెప్పి బాధపడ్డట్టుగా పేర్కొంది. ఈ ఆరోపణలపై రియా కూడా గట్టిగానే రిప్లై ఇచ్చింది. సుశాంత్ ను వదిలేసి వేరొకరితో నిశ్చితార్థం చేసుకుని కూడా అతని ముందు విధవలా ప్రవర్తించేదని, వీరిద్దరి బ్రేకప్ తర్వాత సుశాంత్ స్నేహితుడితో సిగ్గులేకుండా డేటింగ్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇటీవల సుశాంత్ స్నేహితుడు సీరియల్ నటుడు కుషాల్ అంకితతో వస్తున్న డేటింగ్ వార్తలను తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. మరోవైపు సుశాంత్ అతని సన్నిహితుల కాంటాక్ట్ లిస్టును పరిశీలించగా అతని మాజీ ప్రియురాలు అంకిత సుశాంత్ తో ఆరు నెలలుగా పక్కన పెట్టిందని అతని స్నేహితుడైన వ్యక్తితో మాత్రం తరచూ కాంటాక్ట్ లో ఉందని వెల్లడైంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయితేనే అన్ని ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉంది.

Related News