logo

  BREAKING NEWS

ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |   ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!  |   క‌ర్నూలు మ‌హిళ‌కు దొరికిన‌ కోటి రూపా‌యల వ‌జ్రం  |   బ్రేకింగ్‌: క‌రోనా వ్యాక్సిన్‌పై ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌  |   ద‌సరా పండుగ రోజు జ‌మ్మి చెట్టుకు ఎందుకు పూజిస్తారో తెలుసా ?  |  

సుశాంత్ కేసు: అమిత్ షాను ఆశ్రయించిన రియా చక్రబర్తి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యపై అభిమానుల ఆగ్రహావేశాలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ అతని చావుకు కారణమయ్యారంటూ బాలీవుడ్ పై మండిపడుతున్నారు. ఇక వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిపై ట్రోల్ల్స్ కూడా ఆగడం లేదు. వీరికి నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపింది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లోని కొందరు ప్రముఖుల ఒత్తిడే కారణమంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు.

సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిని కూడా పోలీసులు రేండు రోజుల పాటు విచారించారు. రియా తొలిసారిగా సుశాంత్ మరణంపై ఇటీవల ఓ పోస్టు చేసింది. దీనిపై కొందరు అందుకు ధైర్యం చెప్పగా మరికొందరు నెటిజన్లు మాత్రం ఆమెను తీవ్రమైన పదజాలంతో దూషించారు. వారి వివరాలను రియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు నువ్వే కారణమంటూ ఆమెను దూషించారు. ‘నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా లేక రేప్ చేసి చంపేయమంటావా’ అని వేధిస్తున్నారని రియా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటె సుశాంత్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో కొందరు సీబీఐ కి ఈ కేసును అప్పగించాలని డిమాండ్ చేసున్న విషయం తెలిసిందే. తాజాగా రియా చక్రబర్తి ఈ విషయంపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను సోషల్ మీడియా ద్వారా ఆశ్రయించింది. ‘సుశాంత్ మరణించి నెల గడుస్తుంది. అమిత్ షా సార్.. దయచేసి సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించండి. నేను మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాను. అతని ప్రేయసిగా అతను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో నేను తెలుసుకోవాలి. నాకు ప్రభత్వం పై పూర్తి నమ్మకం ఉంది.’ అంటూ ఆమె అమిత్ షాకు ట్వీట్ చేసారు.

Related News