logo

  BREAKING NEWS

క‌రోనా వ్యాక్సిన్ కావాలంటే బీజేపీకే ఓటేయాలా ?  |   గుడ్ న్యూస్: వ్యాక్సిన్ రిలీజ్ డేట్ చెప్పేసిన భార‌త్ బ‌యోటెక్‌  |   మీ పిల్ల‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ స్థాయి హాస్ట‌ల్‌తో కూడిన‌ విద్య కావాలా  |   RRR టీజ‌ర్ కాపీ కొట్టారా..? ప్రూఫ్స్ చూపిస్తున్న నెటిజ‌న్లు  |   ఎన్నిక‌ల్లో గెలిస్తే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌… బీజేపీ హామీ  |   18 నెల‌ల జైలు జీవితం.. ఒక్క మాట‌తో వైఎస్సార్‌కు రాజీనామా లేఖ‌  |   కిడ్నాప్ చేసిన గంట‌లోనే హ‌త్య చేశారు.. ఆ భ‌యంతోనే..!  |   దీక్షిత్‌ను పొట్ట‌న పెట్టుకున్న కిడ్నాప‌ర్లు  |   మ‌ళ్లీ తెర‌పైన శ్రీహ‌రి, సౌంద‌ర్య‌ను చూసే అరుదైన‌ అవ‌కాశం  |   కేసీఆర్‌తో గొడ‌వ ఎక్క‌డ మొద‌లైందో చెప్పిన కోదండ‌రాం  |  

సుశాంత్ కేసులో కొత్త కోణం.. రియా అరెస్టుకు రంగం సిద్ధం!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ప్రేయసి రియా చక్రబర్తి అరెస్టుకు రంగం సిద్ధమైంది. సుశాంత్ ఆత్మహత్యకు రియానే కారణమంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ ఎగవంతం చేసింది. కాగా రియా సుశాంత్ నుంచి కోట్ల రూపాయల డబ్బు తీసుకుందని సుశాంత్ కుటుంబ సభ్యులు ఆమెపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రియా , ఆమె కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశిలీస్తున్నారు.

అందులో భాగంగా రియా వాట్సాప్ చాట్ ను పరిశీలించగా మరికొన్ని షాకింగ్ విషయాలను అధికారులు కనుగొన్నారు. రియాకు డ్రగ్స్ సరఫరా చేసే గౌరవ ఆర్య, మరికొందరితో సంబంధాలు ఉన్నట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. 2017 సంవత్సరం నుంచి ఆమె అతనితో డ్రగ్స్ విషయమై సంప్రదింపులు జరవుతున్నట్టుగా తెలిసింది.

అత్యంత ప్రభావవంతమైన, ప్రమాదకరమైన డ్రగ్స్ గా పిలిచే మిథిలీన్‌ డయాక్సీ మెథాంఫేటమిన్‌ గురించి రియా వారిని అడిగినట్టుగా వాట్సాప్ చాట్ ఆధారంగా కనుగొన్నారు. ఈడీ ఈ సంభాషణలను సేకరించి సీబీఐ అధికారులకు అందించారు. ఈ నేపథ్యంలో రియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.

Related News