logo

  BREAKING NEWS

అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్!  |   ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తేనే కదా తెలిసేది: కేసీఆర్ పై అమిత్ షా  |   వ్యాయామం ఏ వయసు వారు ఎంతసేవు చేయాలి: డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు  |   బ్రేకింగ్: మంత్రి పేర్ని నానిపై హ‌త్యాయ‌త్నం  |   తెలంగాణలో కరోనా అప్ డేట్.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే?  |   ‘సర్జికల్ స్ట్రయిక్స్’ అంటే ఏమిటి? ఎలాంటి సందర్భాలలో నిర్వహిస్తారు?  |   బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |  

రాజమౌళికి ఊహించని షాకిచ్చిన రాంగోపాల్ వర్మ..!

దర్శకధీరుడు రాజమౌళికి ఊహించని షాకిచ్చాడు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఓక్ ఛాలెంజ్ విసురుకోవడం మాములే. ప్రస్తుతం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మదలుపెట్టిన విషయం తెలిసిందే. చెట్లను నాటాలంటూ చేసిన ఛాలెంజ్ ఇప్పుడు ట్రేండింగ్ గా ఉంది. రాజకీయ నాయకుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మొక్కలు నాటుతున్నారు.

అయితే ఇటీవల ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ రామ్ చరణ్ ను పాల్గొనాలంటూ ఆహ్వానించాడు. హీరో రామ్ చరణ్ దగ్గర నుండి ఛాలెంజ్ రాజమౌళి, అలియా భట్ లకు చేరింది. రాజమౌళి సైతం మొక్కలు నాటి తోటి దర్శకులకు ఈ ఛాలెంజ్ ను విసిరాడు. అంతా బాగానే ఉంది కానీ అలా ఎందుకు అనిపించిందో తెలియదు గాని రాజమౌళి వెరైటీగా రాంగోపాల్ వర్మను మొక్కలు నాటమని పిలుపునిచ్చాడు.

దీనిపై ఆర్జీవీ తన స్టైల్ లో స్పందించాడు. తాను ఈ ఛాలెంజ్ ను స్వీకరించనని గ్రీన్ ఛాలెంజ్ ల జోలికి అసలే వెళ్లనని నిర్మొహమాటంగా చెప్పేసాడు. తనకు మట్టిని తాకడం అంటే అసహ్యమన్నాడు. మొక్కలు నాటడం అనేది చాలా మంచి వ్యక్తులకు అర్హమైనవిగా భావిస్తాను. నాలాంటి స్వార్థపరులకు అది సూట్ కాదు. అని ట్వీట్ చేసాడు. దీంతో ఇలాంటి పనులు చేస్తే ఆయన ఆర్జీవీ ఎందుకవుతాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News