logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆర్జీవీ ప‌వ‌ర్ స్టార్ ట్రైల‌ర్ లీక్.. ఇదిగో మీరూ చూడండి..!

వివాదాస్పద ద‌ర్శ‌కులు రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ప‌వ‌ర్ స్టార్ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌క్ష్యంగా ఆర్జీవీ ఈ సినిమా తెర‌కెక్కించాడు. ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ అంటూ తీసిన ఈ సినిమా ట్రైల‌ర్ ఇవాళ విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ ద్వారా ఆన్‌లైన్‌లో ట్రైల‌ర్ చూసేందుకు రూ.25 టిక్కెట్ పెట్టాడు వ‌ర్మ‌. ట్రైల‌ర్‌కు కూడా టిక్కెట్ పెట్టిన మొద‌టి సినిమా ఇదే.

అయితే, ఈ ట్రైల‌ర్ తాను విడ‌ద‌ల చేయ‌క‌ముందే ఒక యూట్యూబ్ ఛాన‌ల్‌లో లీక్ అయ్యింద‌ని వ‌ర్మ ట్వీట్ చేశారు. కాబ‌ట్టి, తాను ఈ ట్రైల‌ర్‌ను నేరుగా యూట్యూబ్‌లోనే విడుద‌ల చేశారు. యూట్యూబ్‌లో విడుద‌ల చేసినందున ట్రైల‌ర్ చూడ‌టానికి రూ.25 చెల్లించిన వారికి తిరిగి డ‌బ్బులు ఇచ్చేస్తాన‌ని వ‌ర్మ ప్ర‌క‌టించారు. ప‌వ‌ర్ స్టార్ సినిమా ట్రైల‌ర్‌లోనే అనేక వివాదాలు క‌నిపిస్తున్నాయి. కొన్ని నిజ‌జీవిత క్యారెక్ట‌ర్లు ఉన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చంద్ర‌బాబు, చిరంజీవి, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌, బండ్ల గ‌ణేష్ త‌దిత‌రుల‌ను పోలిన క్యారెక్ట‌ర్లు ట్రైల‌ర్‌లో క‌నిపిస్తున్నాయి.

Related News