logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

వర్మ సంచలనం.. పవన్ కళ్యాణ్ బయోపిక్.. హీరో ఇతనే!

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసాడు. ఇప్పటికే తెలుగు రాజకీయాలపై సెటైర్లు వేస్తూ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా జన సేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయోపిక్ ను ప్రకటించి షాకిచ్చాడు వర్మ.

ఆదివారం ట్విట్టర్ వేదికగా ఈ ట్వీట్ చేస్తూ… ‘బ్రేకింగ్‌ న్యూస్‌: ఆర్జీవీ వరల్డ్‌ థియోటర్‌ కొత్త సినిమాకు ‘పవర్‌ స్టార్‌’ అని పేరు పెట్టాం. పీకే, ఎమ్‌ఎస్‌, ఎన్‌బీ, టీఎస్‌, ఓ రష్యన్‌ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీతో సినిమా తీయబోతున్నాం. ఈ సినిమాలోని పాత్రలు ఎవరో తెలిపిన వారికి ఎలాంటి బహుమతులు ఇవ్వబడవు. ‘ అంటూ పేర్కొన్నాడు.

తర్వాత ఈనాటి హడావుడి లేకుండానే పవన్ బయోపిక్ లో నటించబోయే హీరో ను కూడా పరిచయం చేసాడు. ఆ నటుడికి సంబందించిన ఓ వీడియో ను పోస్ట్ చేస్తూ మా సినిమాలో హీరో ఇతనే. మా ఆఫీసు దగ్గరకు వచ్చినప్పుడు ఇతన్ని షూట్ చేయడం జరిగింది. మనుషుల్ని పోలిన మనుషులు ఉండటం యాదృచ్ఛికం. కానీ యాదృచ్ఛికం ఉద్దేశ్యపూర్వకం కానీ ఉద్దేశ్యపూర్వకం అంటూ ఎప్పటిలాగే తనడైన శైలిలో తనకు మాత్రమే అర్ధమయ్యే రీతిలో రాసుకొచ్చాడు వర్మ.

Related News