logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆర్జీవీ యాంకర్ కు బంపర్ ఆఫర్.. బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ..?

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ షో లో 16 మంది సెలబ్రిటీలు కలిసి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారి పేర్లను బిగ్ బాస్ యాజమాన్యం షో మొదలైన తర్వాతే వెల్లడిస్తుంది. కానీ అంతకు ముందే సోషల్ మీడియా ద్వారా వీరి వివరాలు లీకైపోతుంటాయి.

ఇప్పుడు సీజన్ 4 విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ షోలో టీవీ, యూట్యూబ్, ఫిల్మ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇలా వివిధ రంగాల నుంచి కంటెస్టెంట్స్ ను ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. వీరిలో ఈసారి హీరో నందు, యాంకర్ మంజూష, వర్షిణి, తాగుబోతు రమేష్, మంగ్లీ పేర్లు లీకయ్యాయి. తాజాగా ఇప్పుడు మరో కంటెస్టెంట్ పేరు వార్తల్లో ఉంది.

యువ యాంకర్ అరియనా గ్లోరీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుందట. ఈ యాంకర్ పేరు చాలా మందికి పరిచయం లేకపోవచ్చు. కానీ సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ఈమె సుపరిచితమే. ఇటీవల దర్శకుడు రాంగోపాల్ వర్మ పలు యూట్యూబ్ చానెళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఓ ప్రముఖ ఛానెల్ లో రాంగోపాల్ వర్మను ఆరియానా ఇంటర్వ్యూ చేసింది.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘రీసెంట్ టైంలో మీకు ఏ అమ్మాయిని చూస్తూ వావ్ అని అనిపించింది’? అంటే.. ‘చాలామందిని అందులో నువ్వు కూడా’ అనేశాడు వర్మ. అతని ఆన్సర్కి తెగ సిగ్గుపడి థాంక్స్ చెప్పింది. ఈ చిన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వర్మను ఇంటర్వ్యూ చేయడం అందరికీ అంత సులువేమీ కాదు. కానీ అమాయకపు హావభావాలతో ఆమె అడిగే ప్రశ్నలకు వర్మకు తెగ నచ్చేసింది.

అంతేకాదు ఆర్జీవీ స్వయంగా వీరిద్దరి ఇంటర్వ్యూ క్లిప్ ను ట్వీట్ చేయడంతో ఈమెకు పాపులారిటీ వచ్చేసింది. ఈ దెబ్బతో ఆరియానా ఇప్పుడు టెలివిజన్ రంగంలో బిజీ యాంకర్ గా మారిపోయింది కూడా. అయితే ఆరియానను స్టార్ మా ఛానెల్ వారు పిలిచి మరీ బిగ్ బాస్ అవకాశం ఇచ్చారనే టాక్ నడుస్తుంది. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

Related News