logo

  BREAKING NEWS

సుప్రీం తీర్పు: అధికారులతో సీఎం జగన్ అత్యవసర సమావేశం!  |   పంచాయతీ ఎన్నికలు.. ఉద్యోగ సంఘాలకు నిమ్మగడ్డ షాక్!  |   బ్రేకింగ్: ఎన్నికలపై సుప్రీం తీర్పు: నిమ్మగడ్డ సంచలన నిర్ణయం!  |   బిగ్ బ్రేకింగ్: ఏపీ పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కీలక తీర్పు!  |   సిక్కిం సరిహద్దుల్లో చైనా దుస్సాహసం.. బుద్ధి చెప్పిన సైనికులు  |   చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |  

లైన్ క్లీయ‌ర్.. పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఎంపిక‌పై గ‌త కొంత‌కాలంగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు దాదాపుగా తెర‌ప‌డింది. పీసీసీ అధ్య‌క్షుడిగా మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు స‌భ్యులు రేవంత్ రెడ్డి పేరు దాదాపు ఖాయ‌మైంది. త్వ‌ర‌లోనే ఆయ‌న పేరును ప్ర‌క‌టించ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ వ‌ర్గాల్లో ప్ర‌చారం సాగుతోంది. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించిన మిగ‌తా సీనియ‌ర్ల‌కు ఇత‌ర ప‌ద‌వులు ఇచ్చి వారిని కూడా పార్టీలో క్రియాశీల‌కం చేయాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ భావిస్తోంది.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి రాజీనామా త‌ర్వాత కొత్త పీసీసీ అధ్య‌క్షుడి ఎంపిక కోసం పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ అభిప్రాయ సేక‌ర‌ణ చేశారు. ఇందులో మెజారిటీ నేత‌లు పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డిని నియ‌మించాల‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఇవ్వాలని కూడా కొంద‌రు సీనియ‌ర్లు, పలువురు డీసీసీ అధ్య‌క్షులు అభిప్రాయ‌ప‌డ్డారు. దీంతో చివ‌ర‌కు రేవంత్ రెడ్డి, కోమ‌టిరెడ్డి మ‌ధ్యే పోటీ న‌డిచింది.

ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి ఇత‌ర ప‌ద‌వి ఏదైనా ఇవ్వాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలించినా ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాను భ‌విష్య‌త్‌లో బీజేపీలో చేర‌తాన‌ని రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌క‌టించారు. భ‌విష్య‌త్‌లో తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్ర‌త్యామ్నాయం అని అన్నారు.

నిజానికి, పీసీసీ రేసులో ఉన్న త‌న అన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి వ్యాఖ్య‌లు న‌ష్టం చేస్తున్నాయ‌ని, ఈ వ్యాఖ్య‌ల వ‌ల్ల వెంక‌ట్ రెడ్డికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి దూర‌మ‌వుతుంద‌ని అంతా అనుకుంటున్నారు. అయితే, త‌న అన్న వెంక‌ట్ రెడ్డికి న‌ష్టం క‌లిగించే ప‌నిని రాజ‌గోపాల్ రెడ్డి చేయ‌ర‌ని వీరి గురించి బాగా తెలిసిన వారు అంటున్నారు.

కాంట్రాక్ట‌రుగా ఉన్న రాజ‌గోపాల్ రెడ్డిని దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి భువ‌న‌గిరి టిక్కెట్ ఇప్పించి ఎంపీని చేశారు వెంక‌ట్ రెడ్డి. అస‌లు రాజ‌గోపాల్ రెడ్డికి రాజ‌కీయ ఓన‌మాలు నేర్పించిందే వెంక‌ట్ రెడ్డి. రాజ‌గోపాల్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా గెల‌వ‌డంలో వెంక‌ట్ రెడ్డిదే కీల‌క‌పాత్ర‌. వీరి మ‌ధ్య మంచి అనుబంధ‌మే ఉంది.

ఇటీవ‌ల జ‌రిగిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూతురి వివాహ‌వేడుకను కూడా రాజ‌గోపాల్ రెడ్డి దగ్గ‌రుండి చూసుకున్నారు. కాబ‌ట్టి, పీసీసీ రేసులో వెంక‌ట్ రెడ్డి ఉన్న ఈ కీల‌క స‌మ‌యంలో ఆయ‌న‌కు న‌ష్టం క‌లిగించేలా రాజ‌గోపాల్ రెడ్డి ఎట్టి ప‌రిస్థితుల్లో మాట్లాడ‌రు. బ‌హుశా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రేవంత్ రెడ్డికి ఖాయ‌మైంద‌ని స‌మాచారం అందిన త‌ర్వాత‌నే రాజ‌గోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారని తెలుస్తోంది.

Related News