logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఆ ప‌త్రిక‌లు, ఛాన‌ళ్ల‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌

తెలంగాణ కాంగ్రెస్ నేత‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీశైలం నీటిని ఎక్కువ‌గా మ‌ళ్లించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ జారీ చేసిన 203 జీవోకు నిర‌స‌న‌గా గాంధీ భ‌వ‌న్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు దీక్ష చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియాను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మీడియా ధోర‌ణిని తీవ్రంగా ఆక్షేపించిన ఆయ‌న త‌మ కార్య‌క్ర‌మాల గురించి ఎందుకు ప్ర‌సారం చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

ముఖ్య‌మైన అంశంపై పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిస్తే ప‌త్రిక‌లు ఎనిమిదో పేజీలో ఎక్క‌డో మూడు ముక్క‌లు రాసి వ‌దిలేశార‌ని ఆరోపించారు. 45 రోజులుగా పీసీసీ చీఫ్ ఎక్క‌డో ఓ చోట కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జాస‌మ‌స్య‌లు లేవ‌నెత్తుతున్నార‌ని, అయినా ప‌త్రిక‌లు స‌రిగ్గా రాయ‌డం లేద‌ని, టీవీలు చూపించ‌డం లేద‌ని వాపోయారు. తమ కార్య‌క్ర‌మాల‌ను మీడియాలో చూపించ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు కాంగ్రెసోళ్లు ఏమీ చేయ‌డం లేద‌ని అనుకుంటున్నార‌ని ఆరోపించారు.

ఇవాళ‌టి దీక్ష‌ను టీవీ ఛాన‌ళ్లు హెడ్‌లైన్స్‌లో చూపించ‌క‌పోయినా, పేప‌ర్లు మొద‌టి పేజీలో ప్ర‌చురించ‌క‌పోయినా మీడియా గురించి పార్టీలో చ‌ర్చించి తీవ్ర నిర్ణ‌యం తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. త‌మ కార్య‌క్ర‌మాల‌ను చూపించ‌ని టీవీ చాన‌ళ్లు, పేప‌ర్ల‌ను బ‌హిష్క‌రించాల‌ని పార్టీ శ్రేణుల‌కు, ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. అవ‌స‌ర‌మైతే గ్రామ‌గ్రామాన ఆ ప‌త్రిక‌ల‌ను కాల్చేస్తామ‌ని, కార్యాలయాల ముందు నిర‌స‌న తెలుపుతామ‌ని హెచ్చ‌రించారు.

Related News