logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

జమిలి ఎన్నికలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

జమిలి ఎన్నికలపై కాంగ్రెస్ నేత, మల్కాజి గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో కేంద్ర బడ్జెట్ పై రేవంత్ స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్ పేరుతో అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయడం మోదీకి, కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. గతంలో బీహార్ కు 5 లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు ఏమైందని ప్రశ్నించారు.

అనంతరం జమిలి ఎన్నికలపై మాట్లాడుతూ.. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహస్తే దేశం రెండుగా చీలిపోవడం ఖాయమన్నారు. ఆ తర్వాత దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుందంటూ జోస్యం చెప్పారు. అధ్యక్షుడు కావడానికి దక్షిణ భారతీయుల ఓట్లు అవసరం ఉండదు, అధ్యక్షుడికి నేరుగా ఎన్నికలు జరిగితే దక్షిణ భారత ప్రజలు సున్నాగా మారతారన్నారు. దేశ విభజన జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనవంతు దేశంగా మారుతుందన్నారు.

దక్షిణాది ప్రజల ఓట్లు అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగితే ఇక్కడి ప్రజలు ఊరుకుంటారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత కీలక పదవులన్నీ ఉత్తరాది వారికే వెళుతున్నాయన్నారు. ట్యాక్సులు అధికంగా దక్షిణ భారతీయులు కడితే నిధులు మాత్రం ఉత్తరాది వారికి వెళుతున్నాయన్నారు. దక్షిణాది ప్రజల వివక్షకు కారణమయ్యే జమిలి ఎన్నికల ఆలోచనలను ప్రధాని మోదీ ఉపసంహరించుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు.

Related News