logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

బొడ్రాయి అంటే ఏమిటి? ఊరి మధ్యనే ఎందుకు ప్రతిష్టిస్తారు?

పల్లెల్లో ప్రతి గ్రామానికి సంబందించి ప్రధాన ద్వారం ఉంటుంది. దానినే ఊరి వాకిలి, పొలిమేర లాంటి పేర్లతో పిలుస్తారు. ఈ ద్వారం దగ్గర బొడ్రాయి అని పిలిచే గుండ్రటి ఆకారంలో ఒక రాయిని ప్రతిష్టిస్తారు. బొడ్రాయికి సంబందించిన సంస్కృతి మన దేశంలో జమిందారీ వ్యవస్థ నుంచీ ఉన్నట్టుగా ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ బొడ్రాయిని కొన్ని గ్రామాల్లో ఊరి బయట కట్టి ఉంచితే మరికొన్ని చోట్ల ఊరి నడి బొడ్డున దీనిని ప్రతిష్టిస్తారు. కొన్ని గ్రామాల్లో లింగయ్య పేరుతో పూజిస్తారు. వివాహాల సందర్భాల్లో ఆడపిల్ల ఊరు దాటి వెళ్ళేటప్పుడు, బయటి ఆడపిల్లలు ఆ ఊరికి కొత్త కోడళ్ళుగా అడుగుపెట్టేటప్పుడు గాని ఆ గ్రామ ప్రవేశ ద్వారం దగ్గర ఉండే బొడ్రాయికి పూజలు చేయిస్తారు.

ఆ తర్వాతనే గ్రామం విడిచి వెళ్లడం లేదా గ్రామంలోకి అడుగుపెట్టడం చేస్తారు. ఈ సందర్భంలో బొడ్రాయి దగ్గర పూజారులుగా ఆగ్రామంలోని బోయలు, తలారి ఉంటారు. గ్రామ దేవతల పూజల సమయంలో, శుభకార్యాలలో ఈ రాయి దగ్గరే జంతువులను బలిస్తారు. చివరకు ఊర్లో ఎవరైనా చనిపోయినా ఆ శవాన్ని ఈ రాయి దాటించాల్సిందే. ప్రతి గ్రామాల్లో బొడ్రాయి పండుగ పేరుతో ఉత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంగా ఊరంతా ఒక చోట చేరి పండుగను జరుపుకుంటారు. అంతేకాకుండా గ్రామంలో అరిష్టం ఏర్పడినప్పుడు, కలరా, మశూచి లాంటి వ్యాధులు ఆ ఊర్లోకి ప్రవేశించకుండా గ్రామస్థులు బొడ్రాయి ప్రతిష్ట చేస్తారు. దీనిని మహాలక్ష్మి అంశగా భావిస్తారు. ఈ రాయిని ప్రతిష్ఠిస్తే ఆ గ్రామానికి చలువ చేకూరుస్తుందని ప్రజలు నమ్ముతారు.

గ్రామదేవతకు ప్రతినిథిగా ఈ రాయిని భావిస్తారు. ఇది గ్రామానికి ధ్వజస్థంభం లాంటిది. ఈ రాయిని ప్రతిష్టించే ఆ గ్రామంలోని ప్రజలకు కొన్ని ఆంక్షలను విధిస్తారు. ప్రతిష్ట జరిగే రోజు ఊర్లోని వారంతా గ్రామంలోనే ఉండాలి. ఊరు ధాటి ఎవరూ వెళ్లకూడదను. అలాగే పెళ్లిళ్లు చేసుకుని వెళ్లి వేరే చోట ఉండే ఇంటి ఆడపడుచులందరినీ పిలిపిస్తారు. దీనికి కారణం బొడ్రాయి అంటే ఊరి నడిబొడ్డును గుర్తించడం. ఊరి భౌగోళిక పరిమాణం, ఊరి నిర్మాణం పైన ప్రజలాంటిదరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ పండుగ చేస్తారని అంటారు. అందులో భాగంగానే ఆడపడుచులను సైతం పిలుస్తారు. ఊరిలోని వారంతా కలిసి ఐక్యమత్యంగా ఉండాలని ఊరి బాగు కోసం ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది దీని వెనక ఉన్న ప్రధాన ఆంతర్యం. ప్రతిష్ట చేయడమే కాకుండా ప్రతి ఏటా వార్షికోత్సవం ఉత్సవాలను జరపడం కూడా సంప్రదాయంగా వస్తుంది.

Related News