logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

రెండు కార్లను అమ్ముకున్న రేణు దేశాయ్.. కారణం ఇదే!

సినీ నటి, దర్శకురాలు, నిర్మాత రేణు దేశాయ్ ‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న రేణు బుల్లితెరపై పలు టీవీ కార్యక్రమాలకు జడ్జిగా కనిపించారు కూడా. కాగా ఇటీవల ఆమె చేసిన ఓ పని ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. రేణు దేశాయ్ తన దగ్గరున్న రెండు లగ్జరీ కార్లను అమ్మేసారు.

ఆ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే కార్లను అమ్మడానికి గల కారణాలను కూడా ఆమె వివరించారు. ఇటీవల మారిష్‌లో జరిగిన చమురు లీకేజీ ఘటన తర్వాత నేను చదివిన ఓ కథనం తనను ఈ పని చేసేలా ప్రేరేపించిందన్నారు. ఆడీ ఏ6, పోర్షే బాక్సర్‌లను అమ్మేసి తాను కొత్త ఎలెక్ట్రిక్ కారును కొన్నట్టుగా తెలిపారు. ఇదంతా పర్యావరణ సంరక్షణలో భాగంగా చేసినట్టు పేర్కొన్నారు.

పెట్రోల్, డీజిల్ వాహనాల వాకం తగ్గించడం వలన పర్యావరణంలో కార్బన్ ను తగ్గించవచ్చన్నారు. భూమి మీద ఉన్న జీవులకు కాన్సర్ ముప్పు తగ్గుతుందన్నారు. రేణు చేసిన ఈ పనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ పని ద్వారా ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Related News