logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే.. ఆ బాధ నాకు తెలుసు: రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘బద్రి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి, విడాకులు ఇలా వివిధ కారణాలతో సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు.

మరో వైపు ‘ఆద్య’ అనే క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా చాలా కాలం తరువాత రెండు దేశాయ్ తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమలో విఫలం అయ్యామని ఆత్మహత్య చేసుకోవడం సరైన మార్గం కాదన్నారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేణు స్పందిస్తూ.. మన ప్రాణం, జీవితం కన్నా ఎవరూ ఎక్కువ కాదు.

ప్రేమించిన వ్యక్తి మనతో లేకుండా, మనల్ని మోసం చేసారనే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఆలోచనలు చాలా కష్టంగా ఉంటాయి. ప్రేమ విఫలమైతే తట్టుకోవడం కష్టమే కానీ మెల్లిమెల్లిగా ఈ బాధ నుంచి బయటపడవచ్చన్నారు. కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూ మళ్ళీ సాధారణ స్థితిలోకి రావచ్చన్నారు. అంతేగాని ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. కాగా రైతుల నేపథ్యంలో రేణు దేశాయ్ ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తెలిపారు.

Related News