చిత్తూరు జిల్లాలో ఈరోజు చంద్రబాబు పర్యటన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బాబు పర్యటనకు అనుమతులు నిరాకరించారు. కరోనా నిబంధనలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలకు, ధర్నాలకు అనుమతి లేదంటూ రేణిగుంట పోలీసులు చంద్రబాబును అడ్డుకున్నారు.
ఎయిర్ పోర్టులోనే బాబుకు నోటీసులు ఇచ్చారు. దీంతో టీడీపీ నేతలు తిరుపతిలో నిరసనలు తెలియజేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డ చంద్రబాబు వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎయిర్ పోర్టులోనే చంద్రబాబు బైఠాయించారు. చిత్తూరు జిల్లాలో దీక్ష, తిరుపతిలో ధర్నా చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ దీక్షలో దాదాపు 5 వేల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు.
ఈ మేరకు పోలీసుల అనుమతి కోరగా కరోనా నిబంధనలు, మరోవైపు మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన చిత్తూరు పోలీసులు అనుమతులు నిరాకరించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి టీడీపీ నేతల ఇళ్లకు నోటీసులను పంపారు. పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మరోవైపు చిత్తూరు పర్యటన కోసం చంద్రబాబు ఈరోజు ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
Watch video Here