మోకాళ్ల నొప్పులు అనేది ఒకప్పుడు మన ఇంట్లో పెద్ద వాళ్లకు, ముసలివాళ్లకు ఉండే సమస్య. కానీ, ఇప్పుడు 30 – 40 ఏళ్ల వాళ్లు కూడా మోకాళ్ల నొప్పులతో విపరీతంగా బాధపడుతున్నారు. ఏ పని చేయలేక, మోకాళ్ల నొప్పులు అంటూ హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. రకరకాల మందులు వేసుకోవడంతో పాటు చెప్పిన ప్రతీ నూనెతో మర్దన చేసుకుంటూ టెంపరరీ రిలీఫ్‌కు అలవాటు పడుతున్నారు. అయితే, కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మోకాళ్ల నొప్పులను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు.
చింతగింజలతో కూడా మోకాళ్ల నొప్పులను తగ్గించుకునే ఒక విధానాన్ని మన గ్రామాల్లో పెద్దవాళ్లు పాటిస్తుంటారు. కేవలం నెల రోజుల్లోనే ఈ చిట్కా ద్వారా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. ముందుగా చింతపండు నుంచి చింత గింజలను తీసి బాగా వేయించి రెండు రోజుల పాటు నీటిలో నానబెట్టాలి. బాగా నానిన తర్వాత చింత గింజల తొలుసును తీసి ఒక రోజు ఎండబెట్టారు. ఎండిన చింత గింజలను రోటిలో వేసుకొని పొడి చేసుకోవాలి.
ఇలా పొడి చేసిన చింతగింజల పొడిని ప్రతీ రోజు కొన్ని పాలు, మంచినీళ్లలో వేసుకొని, టేస్ట్ కోసం కొంచెం చెక్కెర వేసుకొని తాగాలి. మోకాళ్ల నొప్పులకు మోకాళ్లలోని గుజ్జు అరిగిపోవడమే ప్రధానకారణం. ఇలా చింతగింజల పొడితో చేసిన మిశ్రమాన్ని తాగితే మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు తిరిగి వచ్చి నొప్పులు తగ్గుతాయి. చింతగింజలు మనం పడేస్తాం కానీ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మంచివి. మోకాళ్ల నొప్పులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు చింతగింజల పొడి బాగా పని చేస్తుంది. అందుకే గ్రామాల్లో చింతగింజలను భద్రంగా దాచుకుంటారు.
మోకాళ్ల నొప్పులు ఉన్న వారు వాకింగ్‌కు కూడా దూరం అవుతారు. నడిస్తే నొప్పులు మరింత పెరుగుతాయని భయపడతారు. కానీ, ఇది నిజం కాదని వైద్యులు అంటున్నారు. మోకాళ్ల నొప్పులు ఉన్న వారు ప్రతీరోజు కొంతసేపు నడిస్తే మేలని చెబుతున్నారు. ఒకవేళ నడవడానికి కూడా రానంత నొప్పులు ఉంటే గార్డులు, క్రేప్ బ్యాండేజ్ వంటివి వాడి అయినా సరే ప్రతీ రోజు కొంతసేపు నడవడం వల్ల క్రమంగా మోకాళ్ల నొప్పులు అదుపులోకి వస్తాయి.