logo

  BREAKING NEWS

తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |   పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!  |   ‘కాబోయే సీఎం కంగ్రాట్స్’ వేదికపైనే షాకిచ్చిన మంత్రి.. కేటీఆర్ రియాక్షన్ ఇదే!  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ – రామ్‌చ‌ర‌ణ్‌తో ఇండియా టాప్ డైరెక్ట‌ర్ సినిమా..?  |   ‘గుంటూరు’కు చెందిన కోహినూర్ వజ్రం బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది?  |   బ్రేకింగ్: పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. జ‌గ‌న్‌కు భారీ షాక్‌  |   వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |  

హైబీపీ త‌గ్గించుకునేందుకు ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు

ఈ రోజుల్లో ప్ర‌తీ ఇంట్లో ఒక‌రికైనా ఉండే స‌మ‌స్య హై బ్ల‌డ్ ప్రెజ‌ర్‌. గ‌తంలో కొంచెం వ‌య‌స్సులో పెద్ద వారికి మాత్రమే ఈ హై బీపీ స‌మ‌స్య వ‌చ్చేది. ఇప్పుడు వ‌య‌స్సుతో సంబంధం లేకుండా 30 ఏళ్ల వాళ్లు కూడా బీపీతో బాధ‌ప‌డుతున్నారు. కొంద‌రు బీపీని తేలిగ్గా తీసుకుంటారు కానీ హై బీపీ ఉన్న వాళ్లు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. లేక‌పోతే ఇది మ‌రిన్ని తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం కావ‌చ్చు.

బీపీ ఒక‌సారి వ‌స్తే జీవితంతం పోద‌ని చాలా బ‌లంగా న‌మ్ముతారు. ప్ర‌తీ రోజూ ఒక బీపీ మాత్ర వేసుకోవ‌డం ఇక త‌ప్ప‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేస్తారు. ఒక‌సారి హై బీపీ ఉంద‌ని తెలిస్తే ఉప్పు వాడ‌కాన్ని కూడా బాగా త‌గ్గించేస్తారు. బీపీ ఉన్న‌వారైనా, లేని వారైనా ఉప్పు వాడ‌కాన్ని ఎంత త‌గ్గిస్తే అంత మంచిదే. చాలా మందికి ఉప్ప ఎక్కువ తింటే బీపీ పెర‌గ‌డం, త‌క్కువ తింటే కంట్రోల్‌లో ఉండ‌టం మ‌నం గ‌మ‌నిస్తూనే ఉంటాం. హై బీపీ ఉన్న వాళ్లు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉప్పు త‌క్కువ తిన‌డం వ‌ల్ల బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.

ఒక‌వేళ ట్యాబ్లెట్ వేసుకోకుండానే బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం ఉప్పును పూర్తిగా మానేయాలి అని ప్ర‌కృతి వైద్యులు సూచిస్తున్నారు. అయితే, ఉప్పు మానేస్తే లోబీపీ అవుతుంది. క‌ళ్లు తిరగ‌డం, నీరసంగా మారడం వంటివి జ‌రుగుతాయి. కాబ‌ట్టి, ఉప్పు మానేసినా శ‌రీరానికి కావాల్సిన ఉప్పు అందించ‌డం ఎలాగో తెలిస్తే ఉప్పు పూర్తిగా మానేసినా లో బీపీ కాదు, పైగా ట్యాబ్లెట్ వేసుకోక‌పోయినా హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఉప్పును శ‌రీరానికి స‌హ‌జంగా అందించ‌డానికి ఆహార అలవాట్ల‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు పూర్తిగా మానేయ‌డానికి ముందే రోజు క‌నీసం 5 లీట‌ర్ల మంచినీళ్లు తాగ‌డం, ప‌చ్చి కూర‌గాయ‌ల జ్యూస్ తాగ‌డం, మొల‌కెత్తిన విత్త‌నాలు, పండ్లు తిన‌డం అల‌వాటు చేసుకోవాలి. వీటి ద్వారా శ‌రీరానికి కావాల్సిన ఉప్పు స‌హ‌జంగానే అందుతుంది. మామూలు అన్నం బ‌దులు ముడి బియ్యం అన్నం తినాలి.

ఇలా చేస్తూ అప్పుడ‌ప్పుడు బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ కంట్రోల్‌లో ఉంటున్న‌ట్ల‌యితే వైద్యుల‌ను సంప్ర‌దించి ట్యాబ్లెట్స్ డోస్ త‌గ్గించుకుంటూ వెళ్లొచ్చు. ఇలా చేస్తూ వెళితే నెల రోజుల్లో కొంద‌రికి ట్యాబ్లెట్ వాడాల్సిన అవ‌స‌రం కూడా ఉండ‌కుండానే హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఎప్పుడైనా నెల‌లో ఒక‌టి, రెండుసార్లు ఉప్పు వేసిన ఆహారం తిన్నా పెద్ద‌గా స‌మ‌స్య ఏమీ రాదు. ఒక‌వేళ మ‌ళ్లీ ఉప్పు తిన‌డం మొద‌లుపెడితే మ‌ళ్లీ హైబీపీ పెర‌గ‌డం, ట్యాబ్లెట్స్ వాడ‌టం త‌ప్ప‌నిస‌రి అవుతుంది.

అయితే, ఉప్పు లేకుండా వండుకుంటే రుచి ఉండ‌దు క‌దా అనే ప్ర‌శ్న అంద‌రిలో ఉంటుంది. కానీ, ఉప్పు లేక‌పోయినా వంట‌ల్లో కొన్ని చిట్కాలు పాటించ‌డం ద్వారా రుచిక‌రంగా వంట‌లు చేసుకోవ‌చ్చు. ఈ చిట్కాల‌కు గానూ ప్ర‌కృతి వైద్య నిపుణులు మంతెన స‌త్య‌నారాయ‌ణ‌రాజు ఆహారం – ఆలోచ‌న అనే పుస్త‌కంలో చాలా చిట్కాలు ఉంటాయి. అందులో చెప్పిన‌ట్లుగా ఉప్పు లేకుండానే వంట‌లు రుచిక‌రంగా చేసుకోవ‌చ్చు.

Related News