logo

  BREAKING NEWS

గుడ్ న్యూస్‌: క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది..!  |   వైఎస్సార్‌, చంద్ర‌బాబు స్నేహ‌బంధంపై సినిమా  |   క‌రోనా ఖతం అయ్యే డేట్ చెప్పిన బిల్ గేట్స్‌  |   నిజంగానే పాపం త‌గిలిన‌ట్లుంది… క‌రోనాతో ఆ ఎస్సై మృతి  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఆ ప‌ని కాదు.. కొడాని నాని హాట్ కామెంట్స్‌  |   బ్రేకింగ్‌: మాజీ రాష్ట్ర‌ప‌తికి క‌రోనా పాజిటీవ్‌  |   క‌న్న‌డ దంప‌తుల ధైర్యం… పీఓకేలోని శార‌దాపీఠం నుంచి అయోధ్య‌కు ప‌విత్ర మ‌ట్టి  |   పాక్ నుంచి వ‌చ్చిన ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మ‌హ‌త్య‌  |   విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!  |   ప్లాస్మా దానం అంటే ఏమిటి ? ఎవ‌రు చేయాలి ? ఎలా చేయాలి ?  |  

కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!

భారత్ లో కరోనా రికార్డు నమోదైంది. మొట్టమొదటి సరిగా దేశంలో 24 గంటల వ్యవధిలో 20,903 కరోనా కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా నిన్న ఒక్క రోజే 21 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక కరోనా మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది.

నిన్న ఒక్క రోజే కరోనాతో 379 మంది మరణించగా దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 18,213 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వీటిలో గడిచిన వారం రోజుల వ్యవధిలోనే 3 వేల మరణాలు సంభవించాయి. తాజా గణాంకాల ప్రకారం భారత్ లో 3,79,893 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరో 2,27,439 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా 60 శాతం రికవరీ రేటు కొంత ఊరటనిచ్చే విషయం. నిన్న ఒక్కరోజే 20 వేల మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడం గమనార్హం.

ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర ఉండగా.. దాని తర్వాత స్థానంలో రోజుకి 4343 కేసులతో తమిళనాడు విజృంభిస్తుంది. తాజా కేసులతో తమిళనాడులో లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా నమోదవుతున్నా మరణాల్లో ఒక్క మహారాష్ట్ర నుంచే 45 శాతం ఉండటం ఆందోళన కలిగించే విషయం. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్ లు కూడా కరోనాకు నిలయాలుగా మారుతున్నాయి.

Related News