బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. గబ్బా స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియా 32 ఏళ్ల రికార్డును బ్రేక్ చేస్తూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
టీమిండియా గెలుపు బాధ్యతను భుజాలెకెత్తుకున్న రిషబ్, పంత్ లు ఇంకా 18 బాల్స్ ఉండగానే 3 వికెట్ల తేడాతో భారత్ ను గెలిపించారు. సాధారణంగా గబ్బా స్టేడియంలో 32 ఏళ్లుగా ఓటమి తెలియని ఆసీస్ జట్టును ఓడించి టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ మైదానంలో ఆసీస్ ఇప్పటివరకు 55 టెస్టులు ఆడగా మొత్తం 33 మ్యాచులను గెలిచింది.
13 మ్యాచులను డ్రా చేసుకోగా కేవలం 8 మ్యాచుల్లో మాత్రమే ఓడిపోయింది. 1988 ట్రస్టు మ్యాచ్ తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టులో కూడా ఆసీస్ ఈ మైదానంలో ఓటమి చూడలేదు. కానీ ఆ జైత్రయాత్ర నేటితో ముగిసింది. గబ్బా వేదికగా మ్యాచులో ఆసిస్ ను ఓడించి గెలవడం టీమిండియాకు ప్రత్యేకంగా నిలుస్తుందనే చెప్పాలి.