logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

పులివెందులలో 10 వేల మందితో స‌భ.. ర‌ఘురామ‌కృష్ణం రాజు స‌వాల్‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు మ‌రోసారి రెచ్చిపోయారు. పులివెందుల‌కే వ‌స్తాన‌ని స‌వాల్ చేశారు. తనును ప్రేమించే వారు అన్ని ప్రాంతాల్లో ఉన్నార‌ని చెప్పారు. శుక్ర‌వారం పార్ల‌మెంటులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీలో కీల‌క ప‌ద‌విలో ఉన్న ఒక వ్య‌క్తి త‌న‌ను కొంద‌రితో తిట్టిస్తున్నార‌ని ర‌ఘురామ‌కృష్ణంరాజు ఆరోపించారు. తొలుతీస్తా, కొట్టిస్తా అని అంటున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

అయితే, తోలు తీయ‌డం త‌న వృత్తి కాద‌ని, కాక‌పోతే త‌న ఒంటిపై చేయి ప‌డ‌తి అవ‌త‌లి వారి ఒళ్లంతా చిత‌క్కొట్టే వారు తన‌కు ఉన్నార‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. త‌న స్నేహితులు, అభిమానులు త‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఉంటార‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్ల‌మ‌ని చ‌చ్చు వెద‌వ‌లు న‌న్ను స‌వాల్ చేశార‌ని, తాను ఎక్క‌డికైనా వ‌స్తాన‌ని ఆయ‌న స‌వాల్ చేశారు. అవ‌స‌ర‌మైతే రాయ‌ల‌సీమ‌కు, పులివెందుల‌కు కూడా వ‌స్తాన‌ని స‌వాల్ విసిరారు.

పులివెందుల‌లోనే 10 వేల మందితో స‌భ నిర్వ‌హిస్తాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. చూసుకుందామంటే.. చూసుకుందాం అని స‌వాల్ చేశారు. కాక‌పోతే క‌రోనా ప్ర‌భావం తగ్గాల‌ని ఆయ‌న ష‌ర‌తు పెట్టారు. త‌న‌ను ఒక చెంప‌పై కొడితే అవ‌త‌లి వారి ఒళ్లంతా చిత‌క్కొట్టే స్నేహితులు త‌న‌కు అన్ని ప్రాంతాల్లో ఉన్నార‌ని అన్నారు. త‌న‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ ఇవ్వ‌క‌పోయినా, దాడుల‌ను ప్రోత్స‌హించినా న్యాయ‌స్థానాల్లో త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని పేర్కొన్నారు.

Related News