logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

అక్రమ సంబంధాలు అందుకే ఏర్పడతాయి.. తాజా పరిశోధనలో ఆసక్తికర విషయాలు..

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలకు సంబందించి ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం. అక్రమ సంబంధాల కారణంగా ఎన్నో కాపురాలు కూలుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. పిల్లలు అనాథలవుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇలాంటివి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాల్లోనే కాదు.. పెద్దలను, కట్టుబాట్లను ఎదురించి ఏడడుగుల మధ్య ఒక్కటేన ప్రేమ పెళ్లిళ్లలో కూడా ఇలాంటి ఘటనలు కనిపిస్తాయి.

అసలు భాగస్వామి ఉన్నా అక్రమ సంబంధాలపై ఎందుకు ఆసక్తి చూపుతున్నారు అనే అనుమానాలు అందరిలో కలుగుతూనే ఉంటాయి. తాజాగా ఈ కారణాలు అన్వేషించడానికి ఓ స్టడీని చేపట్టారు. అందులో అక్రమ సంబంధాలపై కొత్తగా పెళ్ళైన 233 జంటలను పరిశిలించగా కొన్ని ఆసక్తికర విషయాలను కనుగొన్నారు. వివాహేతర సంబంధాలకు అనేక కారణాలు ఉంటాయట. చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా ఇందుకు కారణం కావొచ్చని అంటున్నారు.

ఈ తరహా సంబంధాలకు మహిళలకన్నా పురుషులే అధికంగా ఆసక్తి చూపుతున్నారని వెల్లడైంది. పెళ్లికి ముందు ఉన్న సంబంధాలను పెళ్లి తర్వాత కూడా కొనసాగించడానికి వారు వెనుకాడకపోవడం కూడా ఒక కారణమే అంటున్నారు. అలాగే తక్కువ ఆకర్షణీయంగా ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. భాగస్వాముల మధ్య పెళ్ళైన కొత్తలో ఉన్న ఆకర్షణ ఆ తరువాత లేకపోవడం వల్ల కూడా ఆ దిశగా ఆలోచనలు వచ్చే అవకాశం ఉందట.

వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ.. అందుకు తగినట్టు తన భర్త గుణగణాలు లేకపోతే పరాయి పురుషులకు ఆకర్షితులవుతున్నారని అంటున్నారు. తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడకపోవడం, నడుచుకోక పోవడం కూడా పక్క చూపులు చూస్తున్నారని పలు సర్వేల్లో తేలినట్లు వెల్లడైంది. ఆశ్చర్యం ఏమిటంటే ఇదంతా వారికి తెలియకుండానే జరుగుతుందట.

ఏం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నామనే స్పృహ ఆ సమయంలో వారికి ఉండదట. ఈ స్టడీలో భాగంగా కొన్ని జంటలకు బాగా ఆకర్షణీయంగా ఉన్న స్త్రీ, పురుషుల ఫోటోలను చూపించారు. అలాగే కొంచెం యావరేజ్ గా ఉన్న వారి ఫోటోలను కూడా చూపించారు. అయితే ఆకర్షణీయంగా, రొమాంటిక్ గా ఉన్న వారి ఫోటోలను చూసినప్పుడు వారి ధ్యాస మళ్లినట్టుగా, ఆకర్షణకు లోనవుతున్నట్టుగా గుర్తించారు.

భాగస్వామి తీరు నచ్చకపోవడం, వారితో సుఖ జీవితం లేకపోవడం, తాము కోరుకున్నట్టుగా భార్య లేదా భర్త ప్రవర్తించకపోవడం కూడా వివాహేతర సంబంధాలకు కారణమవుతున్నట్టుగా పేర్కొన్నారు.

 

 

 

 

 

 

Related News