logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

సుశాంత్ కి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం వారేనా.?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. సినీ, రాజకీయ ప్రముఖులు సుశాంత్ మరణం పై తీవ్ర దిగ్బ్రతి వ్యక్తం చేసారు. వెండి తెరపై ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్ళాడు. మానసిక సమస్యలే సుశాంత్ ని ఆత్మహత్యలు ప్రేరేపించాయని తెలుస్తుంది. కానీ సుశాంత్ అంతగా ఒత్తిడికి గురవ్వడానికి కారణాలేమిటి? ఇప్పుడు అతనికి ఎలాంటి ఆర్థిక ఇబందులు లేవు. ఒప్పుకుంటే గ్యాప్ లేకుండా సినిమాలు చేయగల క్రేజ్ అతని సొంతం. గ్రూప్ డాన్సర్ గా, టీవీ నటుడిగా కెరీర్ మొదలు పెట్టి ఒక్కో మెట్టు ఎదిగాడు.

ఎం ఎస్ ధోని బయోపిక్ లో నటించి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో ధోని అభిమానులంతా సుశాంత్ అభిమానులుగా మారిపోయారంటే ఆశ్చర్యం కలగక మానదు. జీవితంపై అతనికి ఎన్నో కళలు ఉన్నాయి. అంతరిక్షం పై ఉన్న ఇష్టంతో చంద్రుడిపై ఫ్లాట్ కొనుగోలు చేసిన మొదటి బాలీవుడ్ హీరో సుశాంతే. అయినా డిప్రెషన్ కు లోనయ్యాడు. బతకడం కంటే చావడమే నయమనుకునే స్థాయి అగాథంలోకి పడిపోయాడు. ఒక మనిషి ఒత్తిడికి గురైనప్పుడు ఇలాంటి తీవ్ర నిర్ణయాలే తీసుకుంటాడని వైద్య నిపుణులు చెప్తున్నారు.

కానీ అలాంటి పరిస్థితి సుశాంత్ కు ఎందుకొచ్చిందనేది ఇపుడు చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. సినీ తారల జీవితం మామూలు వ్యక్తుల కన్నా వేరుగా ఉంటుంది. సక్సెస్ ను అందుకునే ప్రయత్నంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే సెలెబ్రిటీలు డిప్రెషన్ భారిన పడతారు. దీపికా పదుకునే, శృతి హాసన్ లాంటి ఎందరో తారలు కూడా మానసిక సమస్యలను ఎదుర్కున్న వారే. కానీ వారు ధైర్యంగా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు. వారిని తిరిగి మామూలు మనుషుల్ని చేయడానికి వారి కుటుంబం, ప్రేమించిన వక్తులు ఇలా ఎవరో ఒకరు వారి వెంట నిలిచారు.

కానీ సుశాంత్ పరిస్థితి వేరు. అతను ప్రాణంగా ప్రేమించిన తన తల్లి 2002 లో సుశాంత్ ను వదిలి వెళ్ళిపోయింది. ఆమె మరణం తర్వాత సుశాంత్ తీవ్ర వేదనకు లోనయ్యాడని అప్పటి నుండి ఆ షాక్ లోనే ఉన్నాడని అతని సన్నిహితులు చెప్తున్నారు. సుశాంత్ ప్రియురాలు కూడా అతన్ని వదిలేసింది. 2016 లో వీరిద్దరి మధ్య బ్రేక్ అప్ అయినప్పుడు అంకిత ఓ ట్వీట్ చేస్తూ.. నువ్వు ఒంటరి అని అనుకోకు నేను నీతో లేకపోయినా నీ మనసులో ఎప్పటికీ ఉంటాను’ అని ఆమె తెలిపింది. అంటే సుశాంత్ అప్పటి నుండే ఒంటరి తనంతో బాధపడుతున్నారు అర్థమవుతుంది. ఆ ట్వీట్ ను ఇప్పుడు సుశాంత్ అభిమానులు వైరల్ చేస్తున్నారు.

ఆ తర్వాత రియా చక్రవర్తితో రిలేషన్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఏ ఒక్కరు అతని మానసిక స్థితిని ఎందుకు అర్థం చేసుకోలేక పోయారు అని సందేహం కలుగుతుంది. ప్రేమించిన వ్యక్తులు ఒక్కొక్కరుగా దూరం కావడమే సుశాంత్ ను మానసికంగా కుంగిపోయేలా చేసిందా? మరోవైపు సుశాంత్ ను బాలీవుడ్ దూరం పెట్టింది అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ సుశాంత్ మరణం పై స్పందిస్తూ… సంవత్సర కాలంగా సుశాంత్ ను పట్టించుకోలేదు. అది నను ఇంకా బాధిస్తుంది. అతని మరణం నాకో మేలుకొలుపు. ఇప్పటికైనా మానవ సంబంధాలను మరింతగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించాను అంటూ ట్వీట్ చేసారు. ఆర్నెల్లుగా డిప్రెషన్ కు సుశాంత్ చికిత్స తీసుకుంటున్నాడు. కుటుంబానికి దూరంగా బాంద్రాలో తన ఫ్లాట్ లో ఉంటున్నాడు. పైగా ఈ ఒంటరి తనానికి తోడు అతని తల్లి జ్ఞాపకాలతో కుమిలిపోయాడు. చివరకు ప్రతి ఒక్కరికి విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోయాడు.

Related News