logo

  BREAKING NEWS

క‌డుపులో మంట ఎందుకొస్తుంది ? ఎలా త‌గ్గించుకోవాలి ?  |   ఇక మీ గ‌డ‌ప వ‌ద్ద‌కే బ్యాంకు వ‌స్తుంది.. కొత్త స‌ర్వీసు  |   బ్రేకింగ్‌: తెలుగుదేశం పార్టీ పార్ల‌మెంటు అధ్య‌క్షుల నియామ‌కం  |   ఆ ఛాన‌ల్ ప్రోగ్రాంకు రాక‌పోయి ఉంటే ఎస్పీ మ‌న‌తోనే ఉండేవారా..?  |   బీజేపీ జాతీయ క‌మిటీ నియామ‌కం.. న‌లుగురు తెలుగువాళ్ల‌కు చోటు  |   టీడీపీ, వైసీపీ శ్రేణుల‌ను ఉర్రూత‌లూగించిన ఆ రెండు పాట‌లు పాడింది బాలునే  |   సొంతిల్లు దానం.. స‌మాధిపై ఏం రాయాలో ముందే చెప్పిన బాలు  |   శానిటైజ‌ర్ ఎక్కువ‌గా వాడుతున్నారా..? ఈ ప్ర‌మాదాలు ఉన్నాయి జాగ్ర‌త్త‌..!  |   విషాద వార్త‌… ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇక లేరు  |   తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |  

విజ‌య‌వాడ కోవిడ్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదానికి కార‌ణాలివే..!

విజ‌య‌వాడలోని స్వ‌ర్ణ ప్యాలెస్ హోట‌ల్‌లోని ప్రైవేట్ కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో అగ్ని ప్ర‌మాదం సంఘ‌ట‌న‌కు కార‌ణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ర‌మేష్ ఆసుప‌త్రి ఆధ్వ‌ర్యంలో స్వ‌ర్ణ ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంట‌ర్ ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసిందే. అయితే, ఫైర్ సేఫ్టీ నిబంధ‌న‌ల‌ను హోట‌ల్ నిర్వాహ‌కులు పాటించ‌లేద‌ని అధికారులు గుర్తించారు. ఇందుకే ప్రాణ‌న‌ష్టం ఎక్కువ‌గా జ‌రిగింద‌ని తేల్చారు. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌పై అగ్నిమాప‌క శాఖ ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నుంది.

ఇక‌, కోవిడ్ కేర్ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌లో ర‌మేష్‌ ఆసుప‌త్రి ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రించింద‌ని ప్ర‌భుత్వం గుర్తించింది. పేషెంట్ల వ‌ద్ద ప్ర‌భుత్వం చెప్పిన దాని కంటే భారీగా ఫీజులు వ‌సూలు చేసిన‌ట్లు తేలింది. క‌రోనా పేషెంట్ల వివ‌రాలు సైతం ప్ర‌భుత్వానికి స‌క్ర‌మంగా అందించ‌లేద‌ని అధికారులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఘ‌ట‌న‌పై లోతుగా ధ‌ర్యాప్తు చేయాల‌ని ఆదేశించింది.

మ‌రోవైపు ప్ర‌మాదం ప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష‌నేత చంద్ర‌బాబు నాయుడు దిగ్భ్రాంతికి లోన‌య్యారు. ఘ‌ట‌న గురించి తెలియ‌గానే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోడీ ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు. మృతుల‌కు రూ.50 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ఇస్తామ‌ని, గాయ‌ప‌డిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పారు.

Related News