logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ఆ తప్పులే అభిజిత్ ను గెలిపించాయా?

ఊహించినట్టే జరిగింది. బిగ్ బాస్ టైటిల్ విజేతగా అభిజిత్ నిలిచాడు. ఆ విషయం బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ ముందే తెలుసు. బిగ్ బాస్ విజేతగా అభిజితే గెలుస్తాడని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గత నాలుగైదు వారాల నుంచి అభిజిత్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బిగ్ బాస్ విన్నర్ గా అభిజిత్ కాకుండా మరొకరు అయితే ప్రేక్షకులు ఈ షోను బాయ్ కాట్ చేస్తారేమో అనేంతలా సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. 5 లక్షలకు పైగా ఎక్కువ ట్వీట్లు చేయడంతో అభిజిత్ పేరుపై నేషనల్ రికార్డు నమోదైంది. బిగ్ బాస్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన ఏకైక కంటెస్టెంట్ గా అభిజిత్ నిలిచాడు.

దీంతో గ్రాండ్ ఫినాలేకు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల్లో అభిజిత్ పేరు మార్మోగిపోయింది. అంతా అనుకున్నట్టుగానే బిగ్ బాస్ టైటిల్ అభిజిత్ ను వరించింది. అయితే అభిజిత్ టైటిల్ గెలవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ద్వారా హీరోగా పరిచయమయ్యాడు అభిజిత్. ఆ తర్వాత వెబ్ సిరీస్ ల బాట పట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఒక సాదా సీదా కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు అభిజిత్. షో ఆరంభంలోనే గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్ తో లవ్ ట్రాక్ నడిపి షో నిర్వాహకుల తో పాటుగా ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించాడు. అయితే మోనాల్ అభిజిత్ కు హ్యాండిచ్చి అఖిల్ తో క్లొజ్ అవ్వడం, ఆ తర్వాత అభిజిత్ దేత్తడి హరికతో చనువుగా ఉండటంతో ఈ రెండు ట్రాక్ లు అభిజిత్ ను పాపులర్ చేసాయి.

ఎప్పుడైతే రోబో టాస్క్ లో మైండ్ గేమ్ ఆడి టీమ్ ను గెలిపించాడో అప్పుడే మొదటిసారి అభిజిత్ స్టామినా బయటపడింది. ఆ తర్వాత తోటి కంటెస్టెంట్లయిన అఖిల్, సోహైల్, మెహబూబ్ అతన్ని టార్గెట్ చేస్తుండటంతో బిగ్ బాస్ ప్రేక్షకులు అభిజిత్ పై ఫోకస్ పెట్టారు. అయితే అభిజిత్ బిగ్ బాస్ విన్నర్ గా గెలవడానికి బిగ్ బాస్ షో పరోక్షంగా కారణమైందని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే కంటెస్టెంట్ల ఎంపికపై మొదటి నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి హౌస్ లోకి ఎంటరైన వారిలో నలుగురు ఐదుగురు మినహా అంతా కొత్త మొహాలే. వీరిలో అభిజిత్ కు గట్టి పోటీనిచ్చే కంటెస్టెంట్లు లేకపోవడంతో అభిజిత్ ఈజీగా టైటిల్ గెలిచాడని అంటున్నారు.

మొదటి సీజన్ విన్నర్ శివ బాలాజీ విజయం సాధించడం వెనుక వెనుక అతని భార్య మధుమిత ఉందంటారు. అలాగే కౌశల్, రాహుల్ సిప్లిగంజ్ కు ఆర్మీలు ఏర్పడి తమ అభిమాన కంటెస్టెంట్లను గెలిపించుకున్నారు. అలాగే ఇప్పుడు అభిజిత్ విజయం వెనక అతని పిఆర్ టీమ్ కష్టం ఉందని అంటున్నారు. హౌస్ లోకి వచ్చే ముందే పీఆర్ టీమ్ ను సెట్ చేసుకోవడం వల్ల అది కూడా అభిజిత్ గెలుపుకు ఒక కారణం అయ్యిందని అనేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ సీజన్ బిగ్ బాస్ షో ప్రేక్షకుల్లో ఎలాంటి ఉత్కంఠ కలిగించలేదనే చెప్పాలి. గత రెండు సీజన్ల లాగానే విన్నర్ ఎవరో ముందుగానే తెలిసిపోవడం వల్ల షో చాలా సింపుల్ గా ముగిసింది.

అయితే ఈ సారి బిగ్ బాస్ షోలో కొన్ని లోటుపాట్లు కొట్టొచ్చినట్టుగా తెలుస్తున్నాయి. బిగ్ బాస్ ప్రైజ్ మనీలో సగం సోహైల్ కు వెళ్లిపోవడంతో టైటిల్ గెలిచినా అభిజిత్ కు రూ. 25 లక్షలు, సోహైల్ కు రూ. 25 లక్షలు మిగిలాయి. అదే అఖిల్ విన్నర్ గా గెలిచుంటే బిగ్ బాస్ ఇలా చేసేవాడా? అని ప్రశ్నిస్తున్నారు ఇతర కంటెస్టెంట్ల అభిమానులు. మెహబూబ్ కూడా రూ. 10 లక్షలు గెలుచుకున్నాడు. కానీ టాప్ 5 లో నిలిచినా హారిక, ఆరియానా మాత్రం ఉత్తి చేతులతో వెనుదిరిగారని ఈ లేడీ కంటెస్టెంట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Related News