logo

  BREAKING NEWS

ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |  

న్యాయవాది జంట హత్య కేసులో సంచలన విషయాలు.. అసలు కారణం వెల్లడించిన పోలీసులు!

హైకోర్టు న్యాయవాదుల జంట దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబందించిన సంచలన విషయాలను పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. వామన్ రావు దంపతుల హత్య కేసులో కుంట శ్రీనివాస్‌ను ఏ1గా, చిరంజీవిని ఏ2గా, అక్కపాక కుమార్‌ను ఏ3గా గుర్తించి కేసులు నమోదు చేసాము. వామన్ రావు కు తన గ్రామానికే చెందిన కుంట శ్రీనివాస్ తో ఐదేళ్లుగా వివాదాలు ఉన్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

తన గ్రామంలో చేపడుతున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణం, ఇంటి వివాదంతో పాటుగా వీరి మధ్య రామస్వామి గోపాలస్వామి దేవాలయ మేనేజిమెంట్ కమిటీ వివాదం కూడా ఉంది. దీంతో వామన్ రావు పై కక్ష పెంచుకున్న కుంట శ్రీనివాస్ హత్యకు పథకం వేసాడు. ఈ పథకాన్ని బిట్టు శ్రీని, కారు నడిపిన డ్రైవర్ శివందుల చిరంజీవి అమలు చేశారు. కాగా బిట్టు శ్రీని పెద్దపులి జిల్లా ఛైర్మెన్ పుట్ట మధు మేనల్లుడిగా సమాచారం.

వామన్ రావు హత్య కోసం రిజిస్ట్రేషన్ చేయని నల్లని బ్రేజా కారు, రెండు కొబ్బరి కాయలు కోసే కత్తులను ఉపయోగించారు. హత్య జరిగిన రోజున మధ్యాహ్నం కల్వచర్ల శివారులో కాపు కాసారు. వామన్ రావు కారు అక్కడికి రాగానే కుంట శ్రీను వారి కారును ఢీ కొట్టాడు. కారులో ఉన్న డ్రైవర్ భయపడి దిగిపోవడంతో వామన్ రావు కారు నడిపేందుకు డ్రైవర్ సీటులోకి వెళ్లే ప్రయత్నం చేసాడు. అప్పటికి కారు దగ్గరకు చేరుకున్న కుంట శ్రీను కత్తితో కారు అద్దాలను పగలగొట్టాడు.

వామన్ రావు ను కారు నుంచి బయటకు లాగి కత్తితో దాడి చేసాడు. అదే సమయంలో కారు వెనక భాగంలో కూర్చున్న వామన్ రావు భార్య నాగమణిపై మరో నిందితుడు చిరంజీవి కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. తర్వాత చిరంజీవి కూడా వామన్ రావు పై విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

నిందితులు ఇంక్లైన్ కాలనీ నుంచి సుందిళ్ల బ్యారేజి వైపు వెళ్లిపోయారు. రక్తపు మరకలు ఉన్న బట్టలు, కత్తులను బ్యారేజిలో పడవేశారు. అయితే వీరిద్దరిని మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన కంట శ్రీని గతంలో సింగరేణి కార్మిక సంఖ్యలో పనిచేశాడని బస్సు దహనం, 498 ఏ కేసుల్లో నిందితుడని పోలీసులు వెల్లడించారు.

Related News