logo

  BREAKING NEWS

మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |  

దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ కావ‌డానికి అస‌లు కార‌ణం వీరే‌..!

తెలుగు బిగ్ బాస్ సీజ‌న్ 4 రోజురోజుకూ ఆస‌క్తిగా మారుతోంది. ఒక్కొక్క‌రు ఎలిమినేట్ అవుతుండ‌టంతో గేమ్‌లో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మూడో వారంలో దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ కావ‌డం అన్నింటి కంటే పెద్ద ట్విస్ట్ అని చెప్పాలి. దేవి నాగ‌వ‌ల్లి, మెహ‌బూబ్ ఎలిమినేష‌న్‌లో ఉన్న‌ప్పుడు మెహ‌బూబ్ ఎలిమినేట్ అవుతార‌ని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బిగ్ బాస్ హౌజ్ నుంచి దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ అవ్వాల్సి వ‌చ్చింది.

దేవి నాగ‌వ‌ల్లి బిగ్ బాస్ టాస్కుల్లో చాలా యాక్టీవ్‌గా పాల్గొన్నారు. దీంతో ఆమె మిగ‌తా కంటెస్టెంట్స్‌కు ట‌ఫ్ ఫైట్ ఇస్తార‌ని అంతా అనుకున్నారు. ఆమె కూడా లాస్ట్ వ‌ర‌కు హౌజ్‌లో ఉంటాన‌నే విశ్వాసంతో ఉండేది. కానీ, మూడో వారంలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వ‌చ్చింది. అయితే, ఇలా అనూహ్యంగా దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ కావ‌డం వెనుక ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నార‌నే చ‌ర్చ ఎక్కువ‌గా జ‌రుగుతోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కోపం కార‌ణంగానే దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

దేవి నాగ‌వ‌ల్లి జ‌ర్న‌లిస్టు, న్యూస్ ప్ర‌జెంట‌ర్. వార్త‌లు చ‌ద‌వ‌డంతో పాటు అనేక ఇంట‌ర్వ్యూలు, డిబేట్‌లు చేస్తుంటారు. ఈ నేప‌థ్యంలో శ్రీరెడ్డి అంశంతో పాటు కొన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వ్య‌తిరేకంగా న‌డిచిన‌ డిబేట్లు పెట్ట‌డంతో పాటు ఇంట‌ర్వ్యూలు చేశారామే. ఈ విష‌యంలో దేవి నాగ‌వ‌ల్లిపై పవ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు చాలా కోప‌మే ఉంది. ఇప్పుడు బిగ్ బాస్‌లోకి దేవి నాగ‌వ‌ల్లి ఎంట్రీ ఇవ్వ‌డం ద్వారా ఆ కోపం తీర్చుకునే స‌మ‌యం వాళ్ల‌కు దొరికింది.

ఇంకేముందు దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేష‌న్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌మ ప్ర‌తాపం చూపించారు. ఏదైనా విష‌యంలో పోల‌రైజ్ కావ‌డంలో, ఒకే తాటిపై న‌డ‌వ‌డంలో ప‌వన్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ముందుంటారు. దేవి నాగ‌వ‌ల్లి విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. త‌మ అభిమాన హీరో, నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వ్య‌తిరేకంగా డిబేట్లు పెట్టిన ఛాన‌ల్‌, దేవి నాగ‌వ‌ల్లికి త‌మ బ‌లం చూపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఎలిమినేష‌న్‌లో దేవి నాగ‌వ‌ల్లి, మెహ‌బూబ్ మ‌ధ్యే పోటీ ఉంది.

ఆ స‌మ‌యంలో అంతా మెహ‌బూబ్ ఎలిమినేట్ అవుతార‌ని అనుకున్నారు. కానీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్క‌సారిగా మెహ‌బూబ్‌కు ఓటు వేయ‌డం ద్వారా మెహబూబ్‌ను సేఫ్ చేసి దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ అయ్యేలా చేశార‌ని తెలుస్తోంది. ఇలా ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం కార‌ణంగా బిగ్ బాస్ విన్న‌ర్ అవ్వాల‌ని అనుకున్న దేవి నాగ‌వ‌ల్లి మూడో వార‌మే బ‌య‌ట‌కు రావాల్సి వ‌చ్చింద‌ట‌.

కేవ‌లం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు దేవి నాగ‌వ‌ల్లి ప‌ని చేసే ఛాన‌ల్ మీద‌ కోపంగా ఉన్న కొన్న హిందూ సంస్థ‌ల కార్య‌క‌ర్త‌లు కూడా దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేష‌న్ కోసం ప‌ని చేశార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ వ‌ల్ల‌, త‌ను ప‌నిచేసే ఛాన‌ల్ వ‌ల్ల ఓడిపోయాన‌ని తాను అనుకోవ‌డం లేద‌ని దేవి నాగ‌వ‌ల్లి చెబుతున్నారు.

Related News