logo

  BREAKING NEWS

క‌రోనా బాధితుల‌కు గ్రీన్ ఫంగ‌స్ ముప్పు..లక్ష‌ణాలు, జాగ్ర‌త్త‌లు ఇవే  |   FACK CHECK: క‌రోనా వ్యాక్సిన్ వేసుకుంటే శ‌రీరం అయ‌స్కాంతం అవుతుందా ?  |   కేతిరెడ్డికి జ‌గ‌న్ బంప‌ర్ ఆఫర్.. షాక్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు  |   క‌రోనా వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి  |   గుడ్ న్యూస్‌.. ఆ వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 90 శాతం  |   నెయ్యి తింటే లావుగా అవుతారా ? నెయ్యి ఆరోగ్యానికి మంచిది కాదా ?  |   అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి  |   కేసీఆర్ మాస్ట‌ర్‌స్ట్రోక్‌.. హుజురాబాద్‌లో ఈట‌లకు క‌ష్ట‌మే  |   జూనియ‌ర్ ఎన్టీఆర్ వేరు జెండా.. కుప్పంలో కొత్త డిమాండ్‌  |   పెట్రోల్‌లో 20 శాతం ఇథ‌నాల్‌.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర.. మ‌రెన్నో లాభాలు  |  

ఆ రోజు రాత్రి 9 గంట‌ల‌కు పాక్ ప‌ని ఖ‌త‌మ‌య్యేదా ?

గ‌త ఏడాది పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు మ‌న సైనికుల వాహ‌న‌శ్రేణిపై దాడి చేసి సుమారు 40 మంది సైనికుల‌ను పొట్ట‌న పెట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌తో మ‌న దేశం యావ‌త్తు ఆగ్ర‌హంతో ఊగిపోయింది. పాకిస్థాన్ ప‌న్నిన ఈ దుష్ట ప‌న్నాగానికి బ‌దులు తీర్చుకోవాల‌ని దేశ ప్ర‌జ‌లంతా ముక్త‌కంఠంతో కోరారు. పెద్ద ఎత్తున సైనికుల‌ను కోల్పోయిన ఈ సంఘ‌ట‌న‌పైన మ‌న ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించింది.

అదును చూసి వేటేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి మ‌రీ మ‌న ఎయిర్‌ఫోర్స్ దాడి చేసింది. ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై బాంబుల వ‌ర్షం కురిపించింది. పాక్‌కు ఒక్క‌సారిగా ఈ ప‌రిణామం షాక్‌కు గురి చేసింది. రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలో భార‌త భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించిన పాకిస్థాన్‌కు చెందిన యుద్ధ విమానాన్ని మ‌న ఎయిర్‌ఫోర్స్ కుప్ప‌కూల్చింది. ఈ క్ర‌మంలో సాంకేతిక లోపంతో మ‌న యుద్ధ విమానం ఒక‌టి పాకిస్థాన్ భూభాగంలో కూలిపోయింది.

కూలిన విమానం పైల‌ట్‌, వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ పాకిస్థాన్ సైనికుల‌కు ప్రాణాల‌తో చిక్కారు. శత్రువుకు చిక్కాన‌నే భ‌యం ఆయ‌న‌లో క‌నిపించ‌లేదు. పాక్ సైనికులు విచ‌క్ష‌ణార‌హితంగా ఆయ‌న‌పై దాడి చేసినా అభినంద‌న్ ఎక్క‌డా భ‌య‌ప‌డ‌కుండా వీరుడిలా నిల్చున్నాడు. అభినంద‌న్‌ను అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ మొద‌ట ఆయ‌నను అడ్డం పెట్టుకొని మ‌న దేశాన్ని ఇబ్బంది పెట్టాల‌ని అనుకుంది.

కానీ, అనూహ్యంగా అభినంద‌న్‌ను విడిచిపెట్టింది. అంత‌ర్జాతీయ ఒప్పందాలు, శాంతి స్థాప‌న కోస‌మే తాము అభినంద‌న్‌ను విడిచిపెడుతున్నామ‌ని చెప్పింది. ఈ సంఘ‌ట‌న జ‌రిగి సుమారు రెండేళ్లు కావొస్తోంది. అయితే, అభినంద‌న్‌ను విడిచిపెట్ట‌డానికి అస‌లు కార‌ణం ఏంట‌నేది ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. పాకిస్థాన్ వైపు నుంచే అప్పుడు జ‌రిగిన ప‌రిణామాలు బ‌య‌టకు వ‌చ్చాయి.

పాకిస్థాన్ విప‌క్ష ఎంపీ అయాజ్ సాధిక్‌ ఆ రోజు ప‌రిణామాల‌ను బాహాటంగా వెల్ల‌డించారు. ”అభినంద‌న్‌ను అదుపులోకి తీసుకున్న త‌ర్వాత పాక్ ప్ర‌భుత్వం అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశానికి పాక్ ఆర్మీ చీఫ్ క‌మ‌ర్ జావేద్ బాజ్వా కూడా హాజ‌ర‌య్యారు. స‌మావేశానికి హాజ‌రైన విదేశాంగ మంత్రి షా మొహ‌మ్మ‌ద్ ఖురేషీ ప‌రిణామాల‌ను వివ‌రించారు. అభినంద‌న్‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి, లేక‌పోతే రాత్రి తొమ్మిది గంట‌లు పాకిస్థాన్‌పై భార‌త్ దాడి చేస్తుంద‌ని ఆయ‌న సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పారు.

ఖురేషీ ఈ మాట‌లు చెబుతున్న‌ప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ క‌మ‌ర్ జ‌వేద్ బాజ్వా కాళ్లు భ‌యంతో వ‌ణికాయి. ఆయ‌న భ‌య‌ప‌డ‌టం నాకు ఇంకా గుర్తింది” అంటూ అయాజ్ సాధిక్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌కు పాకిస్థాన్ ఎంత భ‌య‌ప‌డిందో ఈ ఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. అయితే, అయాజ్ సాధిక్ వ్యాఖ్య‌ల త‌ర్వాత పాక్ మ‌రోసారి స్పందించింది. కేవ‌లం శాంతి కోస‌మే తాము అభినంద‌న్‌ను విడుద‌ల చేశామ‌ని చెప్పుకుంది.

Related News