logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

చిరంజీవి గుండు వెనుక అస‌లు సీక్రెట్ ఇదీ(వీడియో)

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల కొత్త లుక్‌తో అంద‌రికి షాక్ ఇచ్చారు. ఒక్క‌సారిగా గుండుతో క‌ళ్ల‌ద్దాలు పెట్టుకొని ఉన్న లుక్‌ను సోష‌ల్ మీడియాలో చిరంజీవి స్వ‌యంగా పోస్ట్ చేశారు. దీంతో ఆయ‌న అభిమానులు, సాధార‌ణ నెటిజ‌న్లు కూడా చిరంజీవి లుక్ చూసి షాక్ అయ్యారు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న చిరంజీవి గుండు చేయించుకుంటే సినిమాల షూటింగ్‌కు ఇబ్బంది క‌దా అనే చ‌ర్చ జ‌రిగింది.

అయితే, ఓ త‌మిళ సినిమా రీమేక్‌లో చిరంజీవి న‌టిస్తున్నార‌ని, ఈ సినిమా కోస‌మే గుండు చేయించుకున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. చిరంజీవి కొత్త లుక్ చూసి మామూలు నెటిజ‌న్ల‌తో పాటు ఆయ‌న కుమారుడు రామ్ చ‌ర‌ణ్ సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే, చిరంజీవి నిజంగా గుండు చేయించుకోలేద‌ని ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

చిరంజీవి గుండు ఒక మేక‌ప్ మాత్రమే. మేక‌ప్ ఆర్టిస్టులు చాలా క‌ష్ట‌పడి చిరంజీవి గుండుతో ఉండేలా మేక‌ప్ చేశారు. ఇందుకు సంబంధించిన మేక‌ప్ వీడియోను చిరంజీవి త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ మేక‌ప్ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related News