logo

  BREAKING NEWS

బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |  

రియల్ మీ స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి.. తక్కువ ధరకే ఆధునిక ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ ఎట్టకేలకు తన కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్ మీ ఎక్స్3, రియల్ మీ ఎక్స్3 సూపర్ జూమ్ పేరుతో వీటిని ప్రవేశపెట్టింది. వెనక వైపు నాలుగు కెమెరాలు, 120 హెర్ట్జ్ డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ తో వీటిని రూపొందించారు. ఈ స్మార్ట్ ఫోన్ల ధరలు, ప్రత్యేకతల విషయానికొస్తే..

రియల్ మీ ఎక్స్3:
రెండు వేరియంట్లలో ఇవి లభించనున్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999గా ఉంది. ఆర్కిటిక్ వైట్, గ్లేసియర్ బ్లూ రంగులలో లభిస్తున్నాయి. వీటికి సంబంధించి జూన్ 27 నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కాగా జూన్ 30 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి.

ఫీచర్లు:
6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లే తోపాటుగా 64 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా సామర్థ్యం. 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.32,999గా నిర్ణయించారు.

రియల్ మీ ఎక్స్ 3 సూపర్ జూమ్:
రియల్ మీ ఎక్స్3 సూపర్ జూమ్ లో ప్రత్యేకతలు కూడా రియల్ మీ ఎక్స్3 ని పోలి ఉంటాయి. వాటితో పాటుగా 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అల్ట్రా స్మూత్ డిస్ ప్లే, 12 జీబీ ర్యామ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఇది పనిచేస్తుదని. 4,200 ఎంఏహెచ్ గా బ్యాటరీ సామర్థ్యం కలదు. 30W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 4జీ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లను ఇందులో కూడా అందించారు.

Related News