logo

  BREAKING NEWS

తుమ్ములు ఎక్కువ‌గా వ‌స్తున్నాయా ? ఈ చిట్కా పాటిస్తే త‌గ్గిపోతాయి  |   జ‌గ‌న్‌ను ఓడించే కుట్ర‌..? కొడాలి నాని పాత్ర‌..?  |   బ్రేకింగ్‌: జ‌గ‌న్ ఇంటి ముట్ట‌డి.. హైద‌రాబాద్‌, తిరుప‌తిలో ఉద్రిక్త‌త‌‌  |   బ్రేకింగ్: డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో మ‌హేష్ బాబు స‌తీమ‌ణి న‌మ్ర‌త పేరు  |   అమెరికా నుంచి ఎలా వ‌చ్చింది..? ‘కాంగ్రెస్ గ‌డ్డి’ అని ఎందుకు పిలుస్తారు ?  |   తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్య‌క్షుడి పేరు ఖ‌రారు  |   ఇక నుంచి ‘యాదాద్రి’ రైల్వే స్టేష‌న్‌  |   హ‌రీష్ రావు వ‌ర్సెస్ ర‌ఘునంద‌న్‌రావు  |   ఈ చిన్న ప‌ని చేస్తే 15 నిమిషాల్లో త‌ల‌నొప్పి మాయం  |   రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే  |  

అద్భుతమైన ఫీచర్లతో రియల్ మీ సేల్ ప్రారంభం.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ఈరోజు తన 6ఐ ఫోన్ సేల్ ను ప్రారంభించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ మొదలైంది. రియల్ మీ వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ నుంచి వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిలో రెండు వేరియంట్లను అందుబాటులో ఉంచింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. ఎక్లిప్స్ బ్లాక్, లూనార్ వైట్ రంగులలో లభిస్తున్నాయి.

రియల్ మీ 6ఐ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు..
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 90.5 శాతంగా ఉంది. అలాగే ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అందించారు. వెనుక భాగం లో నాలుగు కెమెరాలను అందించారు. ఇక ముందువైపు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్ పై రియల్ మీ 6ఐ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందుబాటులో ఉంది. 64 జీబీ వరకు స్టోరేజ్ మైక్రో ఎస్ డీకార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

Related News