logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆ రెండు ప్ర‌చారాలూ అబ‌ద్ధాలే.. అస‌లు క‌థ ఇది..!

బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ న‌ట జీవితంలో విల‌న్ కానీ నిజజీవితంలో ఆయ‌న హీరో. ల‌క్ష‌ల మంది అభిమానులు, కోట్లాది డ‌బ్బులు ఉన్న హీరోలు కూడా చేయ‌లేని సేవ‌లు సోనూసూద్ చేస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం మొద‌లై లాక్‌డౌన్ విధించిన త‌ర్వాత చేతికి ఏముక‌ లేన‌ట్లుగా సోనూ ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. ఈ కోవ‌లోనే చిత్తూరు జిల్లా కంభంవారిప‌ల్లె మండ‌లం మ‌హ‌ల్‌రాజ‌ప‌ల్లి గ్రామానికి చెందిన వీర‌ద‌ల్లు నాగేశ్వ‌ర‌రావుకు ట్రాక్ట‌ర్ కొనిచ్చారు. దీంతో సోనూపై ప్ర‌శంస‌ల‌జ‌ల్లు కురిసింది. అయితే, ట్రాక్ట‌ర్ పొందిన వ్య‌క్తి రైతు కాద‌ని, ఆయ‌న ఎమ్మెల్యే అభ్య‌ర్థి అనే ప్రచారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఏది నిజమో ఓసారి తెలుసుకుందాం.

నాగేశ్వ‌ర‌రావుకు భార్య‌, ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు. పెద్ద కూతురు ఇంట‌ర్‌, చిన్న‌కూతురు ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నారు. నాగేశ్వ‌ర‌రావు మాజీ న‌క్స‌లైటు. 1996లోనే ఆయ‌న జ‌న‌జీవ‌న‌స్ర‌వంతిలో క‌లిశారు. దీంతో ప్ర‌భుత్వం ఆయ‌న‌కు మ‌ద‌న‌ప‌ల్లిలో ఇంటి స్థ‌లం మంజూరు చేసింది. అక్క‌డే ఇల్లు క‌ట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ మ‌ద‌న‌ప‌ల్లిలో జీవ‌నం ప్రారంభించారు. ఆర్థికంగా ఆయ‌న ధ‌నికుడు ఏమీ కాదు. 2003లో ఉన్న ఇంటిని కూడా అమ్మేసి మ‌ద‌న‌ప‌ల్లిలోనే అద్దె ఇంట్లో నివ‌సిస్తున్నారు. మ‌ద‌న‌ప‌ల్లి డెంట‌ల్ హాస్పిట‌ల్ వ‌ద్ద టిఫిన్ సెంట‌ర్ పెట్టుకొని నాగేశ్వ‌ర‌రావు కుటుంబం జీవితం గ‌డుపుతోంది.

నాగేశ్వ‌రరావుకు స్వంతూరు మ‌హ‌ల్‌రాజ‌ప‌ల్లిలో రెండెక‌రాల భూమి ఉంది. లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద‌న‌ప‌ల్లిలో టిఫిన్ సెంట‌ర్ మూత‌బ‌డ‌టంతో స్వంతూరుకు వ‌చ్చారు. ఈసారి తానే స్వ‌యంగా వ్య‌వ‌సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. త‌న పొలం దున్న‌డానికి ట్రాక్ట‌ర్‌, ఎడ్ల బ‌దులు త‌న ఇద్ద‌రు కూతుళ్లు నాగ‌లి లాగారు. ఇది స్థానికంగా ఓ విలేఖ‌రి వీడియో తీశారు. సోనూసూద్ అప్ప‌టికే చేస్తున్న సహాయాల గురించి అవ‌గాహ‌న ఉన్న స‌ద‌రు విలేఖ‌రి ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను సోనూకు ట్యాగ్ చేశారు. ఆడ‌పిల్ల‌లు నాగ‌లి లాగ‌డాన్ని చూసి చ‌లించిపోయిన సోనూసూద్ ఒకేరోజులో వారి ఇంటికి కొత్త ట్రాక్ట‌ర్ పంపించారు.

ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఎంట‌ర్ అయ్యారు. సోనూసూద్‌ను అభినందించి, ఆ ఆడ‌పిల్ల‌ల‌ను తానే చ‌దివిస్తాన‌ని మాట ఇచ్చారు. అయితే, అస‌లు ఏం జ‌రిగిందో తెలుసుకోవాల‌ని ప్ర‌భుత్వం స్థానిక అధికారుల‌ను ఆదేశించింది. దీంతో ఎంపీడీఓ వెళ్లి నాగేశ్వ‌ర‌రావు కుటుంబంతో మాట్లాడారు. తాము ఒక గుర్తుగా ఉంటుంద‌నే ఉద్దేశ్యంతోనే స‌ర‌దాగా అంద‌రం క‌లిసి పొలం దున్నామని, త‌మ వీడియో ఇంత వైర‌ల్ అవుతుంద‌ని అనుకోలేద‌ని ఆ కుటుంబం చెప్పింది. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శ‌ల‌పాలు చేసే ప్ర‌య‌త్నం సోష‌ల్ మీడియాలో జ‌ర‌గ‌డంతో నాగేశ్వ‌ర‌రావు కుటుంబానికి ఏమేం స‌హాయం చేశామో ప్ర‌భుత్వం త‌ర‌పున కొంద‌రు చెబుతున్నారు.

నాగేశ్వ‌ర‌రావుకు రైతు భ‌రోసా డ‌బ్బులు అందుతున్నాయి. ఆయ‌న చిన్న కుమార్తెకు అమ్మ ఒడి, పెద్ద కుమార్తెకు జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కం అందింది. నాగేశ్వ‌ర‌రావు త‌ల్లికి అభ‌య‌హ‌స్తం పింఛ‌న్‌, తండ్రికి వృద్ధాప్య పింఛ‌న్ అందుతోంది. వ్య‌వ‌సాయం చేయ‌డానికి నాగేశ్వ‌ర‌రావు రైతు భ‌రోసా కేంద్రంలో ఎరువులు, విత్త‌నాలు కూడా పొందారు. ఈ వివ‌రాల ప్ర‌కారం నాగేశ్వ‌ర‌రావుకు ప్ర‌భుత్వం త‌ర‌పున కూడా ఎంతో కొంత స‌హ‌కారం అందింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే, ఆడ‌పిల్ల‌లు నాగ‌లి దున్న‌డం చూసి సోనూసూద్ వీరికి ట్రాక్ట‌ర్ కొనిచ్చాడు. ఒక గుర్తుగా ఉంటుంద‌ని స‌ర‌దాగానే ఈ కుటుంబం ఆ ప‌ని చేసింది కానీ మోస‌పూరితంగా సోనూ నుంచి ట్రాక్ట‌ర్ పొందాల‌ని మాత్రం చేయ‌లేదు. నిజానికి త‌మ వీడియో సోనూసూద్ వ‌ర‌కు వెళుతుంద‌ని కూడా వారికి తెలియ‌దు. పైగా నాగేశ్వ‌ర‌రావు పేద‌వాడే. ప్ర‌భుత్వ‌మే అన్ని ప‌థ‌కాలు అందించింద‌ని చెబుతున్నందున ఆయ‌న బిలో పావ‌ర్టీ లైన్ ప‌రిధిలోనే ఉన్నారు. మ‌ద‌న‌ప‌ల్లిలో నాగేశ్వ‌ర‌రావు చేసేది చిన్న టిఫిన్ సెంట‌ర్ వ్యాపార‌మే. అది కూడా మూత‌బ‌డ‌టం వ‌ల్లే ఆయ‌న వ్య‌వ‌సాయం ప్రారంభించారు. ఇలా ఏ ర‌కంగా చూసినా ట్రాక్ట‌ర్ పొంద‌డానికి నాగేశ్వ‌ర‌రావు కుటుంబానికి అన‌ర్హ‌త ఏమీ లేదు.

ఇక‌, నాగేశ్వ‌ర‌రావు లోక్‌స‌త్తా పార్టీ త‌ర‌పున 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడ‌నే మ‌రో ప్ర‌చార‌మూ ఉంది. ఇది కూడా నిజ‌మే. ఆయ‌న మాజీ న‌క్స‌లైటు. అంటే స‌మాజం ప‌ట్ల కొంత అవ‌గాహ‌న‌, త‌పన ఉన్న వ్య‌క్తి. పౌర‌హ‌క్కుల సంఘంలోనూ ప‌ని చేశారు. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో అవినీతికి వ్య‌తిరేకంగా పుట్టిన లోక్‌స‌త్తా పార్టీ ప‌ట్ల ఆయ‌న ఆక‌ర్షితులై పోటీ చేసి ఉండ‌వ‌చ్చు. మిగ‌తా పార్టీల్లా ఈ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి ల‌క్ష‌ల డ‌బ్బు కూడా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అందుక‌ని నాగేశ్వ‌ర‌రావు ఎమ్మెల్యేగా పోటీ చేసినందున ఆయ‌నను ధ‌నికుడుగా ఏమీ భావించాల్సిన అవ‌స‌రం కూడా లేదు.

Related News